WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌కళ్యాణ్‌' భరతనాట్యం నేర్చుకుంటున్నారు...:మైసూరారెడ్డి

ప్రస్తుతం సినీ నటుడు 'పవన్‌కళ్యాణ్‌' ఇంట్లో ఉండి భరత నాట్యం నేర్చుకుంటున్నారని, ఆయన నాట్యం బాగుందో...లేదో ఇప్పుడే ఎలా చెబుతామని...ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి 'జనం'లో నాట్యం ఆడితే అది బాగుందోలేదో...చెప్పవచ్చని...సీనియర్‌ రాజకీయనాయకుడు మైసూరారెడ్డి అన్నారు. త్వరలో 'పవన్‌కళ్యాణ్‌' రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నారు కదా...ఆయన ప్రభావం ఎలా ఉంటుందన్న ఓ ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు ఈ వెటరన్‌ రాజకీయనాయకుడు. ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పేమిటని ఆయన ప్రశ్నించారు...? 'చంద్రబాబు' ఎక్కడా ఎమ్మెల్యేకు డబ్బులు తీసుకుని ఓటు వేయమని చెప్పలేదు...కదా...? దానిలో విమర్శించడానికి కానీ...కేసు పెట్టడానికి కానీ ఏముంది...? ఆయన ఎమ్మెల్సీతో మాట్లాడిందేమీ లేదు...మీ ఇష్టం వచ్చిన వారికి...ఓటు వేసుకోండి...అనే కదా అన్నారు..దీనిలో అవినీతికి ఆస్కారం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా చిన్న కేసని ఇటువంటి దానికి 'చంద్రబాబు' భయపడి...పోయి..ఆంధ్రాకు వెళ్లిపోయారనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. కెసిఆర్‌కు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు ముగిసిపోయిన అధ్యాయమని...దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మైసూరారెడ్డి. ఇక ఎమ్మెల్యేలకు సూట్‌ కేసులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారన్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ ఇది బట్ట కాల్చి మొహంపై వేసుకోవడం లాంటిదేనన్నారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చట్టంలో పేర్కొన్నట్లు నియోజకవర్గాల పునర్‌విభజన జరిగిన తరువాత 'కమలాపురం' నియోజకవర్గంపై స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికలకు ముందు 'జగన్‌'కు తాము ఇచ్చిన సలహాలను ఆయన పట్టించుకోలేదని...రుణమాఫీ హామీని ఇవ్వాలని తాము చెప్పినా 'జగన్‌' వినలేదని దాని ఫలితం ఎన్నికల్లో బయటపడిందన్నారు. మొత్తం మీద వైకాపాకు చెందిన ఈ మాజీ నాయకుడు ఇప్పుడు 'చంద్రబాబు' శోత్త్రం చదువుతున్నారు. నాడు రాజ్యసభ సీటు రెవిన్యువల్‌ చేయలేదని 'జగన్‌'కు సలహాలు ఇవ్వడానికే వెళ్లానని చెప్పిన మైసూరా 'జగన్‌' దెబ్బ చూసిన తరువాత తత్వం బోధపడినట్లుంది. మళ్లీ టిడిపిలో చేరడానికే 'చంద్రబాబు'కు అనుకూలంగా మాట్లాడుతున్నారని రాజకీయపరిశీలకులు అంటున్నారు. మరి...చంద్రబాబు కరుణిస్తారా...?

(665)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ