WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శునకాన్ని పెళ్లి చేసుకున్న వెర్రి వెంకన్న...!

వెర్రి వేయి విధానాలని...వెనకటి ఎవరో ఊరికనే చెప్పలేదు...ఇటువంటి వ్యక్తులను చూసి చెప్పారేమో...మరి వెర్రి కాకపోతే శునకాన్ని పెళ్లి చేసుకోవటం ఏమిటి? జీవితంలో తనకు ఏదీ కలసి రావడం లేదట...అప్పులు పుట్టడం లేదట...జీవితంలో స్థిరపడలేదట...ఆరోగ్యం బాగాలేదట...పెళ్లి కాలేదట...ఇంకా ఏవో..ఏవో సమస్యలట.ఈ సమస్యలన్నీ పోవాలంటే ఏమి చేయాలి..? స్వశక్తితో సమస్యలను ఎదిరించాలి..కానీ అంత ఆలోచన ఈ వెర్రి వెధవకు ఎక్కడ ఉంది....సమస్యలు ఎదురైతే సగటు వ్యక్తి ఏవిధంగా స్పందిస్తారో..అదే విధంగా స్పందించాడీ వ్యక్తి...తన సమస్యలకు కారణం జాతకమేనట..జాతకంలో ఉన్న దోషాలు పోవాలంటే ఏం చేయాలి...ఇంకేముంది..జ్యోతీష్కుడ్ని ఆశ్రయించడమే...వెంటనే సదరు జాతకాలు చెప్పే వ్యక్తిని కలిశాడు..అసలే మనోడు వెర్రోడు అయితే జ్యోతీష్కుడు అంతకన్నా పెద్ద వెర్రోడు...వెంటనే ఓ కుక్కను పెళ్లాడు..నీకు జీవింతలో ఎదురయిన సమస్యలన్నీ తొలిగిపోతాయని చెప్పాడట. దీంతో మనోడు జ్యోతీష్కుడు చెప్పిన దాన్ని పట్టుకుని ఎక్కడ నుంచో ఓ కుక్కను తీసుకు వచ్చి దానికి మూడు ముళ్లు వేసేశాడు. దీన్ని ఫోటోలు కూడా తీసి నెట్‌లో పెట్టేశాడు...ఇంకేం ఉంది...నెట్‌లో ఇది వైరల్‌ అయింది. అన్నట్లు జంతువులను పెళ్లాడడం చట్ట రీత్యా నేరం అనుకుంటా...? మరి జంతు ప్రేమికులేమంటారో చూడాలి..

(377)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ