WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో రెండువేల నోట్‌...విడుదల...!

ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ వెంటనే రెండు వేల రూపాయల నోట్‌లను విడుదల చేయడానికి రిజర్వ్‌బ్యాంక్‌అంగీకరించిందని ఆయన చెప్పారు. ఒక వైపు వెయ్యి,ఐదువందల నోట్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మరోవైపు రెండువేల రూపాయల నోట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం...మరోవైపు రెండువేలు,ఐదువేల నోట్లపై ప్రకటన చేయడంపై ఆందోళన, అయోమయం నెలకొంది. అయితే వంద రూపాయల నోట్‌లు ముద్రించడం ఖర్చుతో కూడుకున్న పని అవడంతో రెండు వేల రూపాయల నోట్‌ను ముద్రించబోతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థల చేతుల్లో వెయ్యి,ఐదు వందల నోట్లుతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన ప్రధాని ఇప్పుడు రెండు వేల నోట్లు ప్రవేశపెడితే ఈ సమస్య రాదా? అని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.

(573)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ