WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

12,13 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి...!

నోట్లు రద్దు దెబ్బకు వరుసగా రెండు రోజులు బ్యాంక్‌లకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు శుభవార్త. ఇప్పటికే చిల్లర లభించక, నోట్లు ఉన్నా వాటిని ఉపయోగించుకోలేక బాధలు పడుతున్న వినియోగదారులకు రిజర్వ్‌బ్యాంక్‌ ఉపశమనం కల్గించే వార్తను చెప్పింది. రెండో శనివారమైన 12వ తేదీ, 13వ తేదీ ఆదివారం రోజు కూడా బ్యాంక్‌లు పనిచేస్తాయని ప్రకటించింది. దీంతో రేపటి నుంచి వచ్చే ఆదివారం అంటే 20వ తేదీ వరకు వరుసగా బ్యాంక్‌లు పనిచేయబోతున్నాయి. 14వ తేదీన సెలవు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ రోజు గురునానక్‌ జయంతి. మరి దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా 10,11,12,13 తేదీల్లో వరుసగా బ్యాంకులు పనిచేయబోతున్నాయి. దీంతో ప్రజలు తమ సొమ్మును బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసుకోవడానికి...కొత్త నోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిన్నటి నుంచి తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలకు దీంతో కొంత వరకు స్వాంతన లభించబోతోంది.

(513)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ