'పవన్‌' సభ జరిగేనా...? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌' సభ జరిగేనా...?

గురువారం నాడు అనంతపురంలో జనసేన ఆధ్వర్యంలో జరిగే సీమాంధ్రహక్కుల చైతన్యసభపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ...సినీనటుడు,జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' ఈ సభను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం పలు సభలు నిర్వహించారు. దానిలో భాగంగా గురువారం నాడు అనంతపురంలో భారీ ఎత్తున మరో సభను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. అయితే ఇప్పుడు ఈ సభ జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనే సందేహం నిర్వాహకుల్లో తలెత్తుతోంది. ఎందుకంటే గత రాత్రి ప్రధాని మోడీ ఐదు వందల నోటు, వెయ్యి నోట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభావం ప్రజలపై తీవ్ర స్థాయిలో పడింది. సామాన్య 'జనం' చేతిలో డబ్బున్నా అవి చెల్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులుపాలవుతున్నారు. ఇప్పుడు 'పవన్‌' సభకు ప్రజలు రావాలంటే వారి చేతిలో నగదు ఉండాలి. ఐదు వందలు, వెయ్యి నోట్లు ఉన్నా వాటి వల్ల ఉపయోగం లేకపోవడంతో అందరూ వంద నోట్లు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. 'పవన్‌' అభిమానులు ఎవరికివారు స్వచ్చంధంగా వచ్చేవారే కాబట్టి వారిపై ఈ నోట్ల రద్దు ప్రభావం పడే అవకాశం ఉంది.దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిర్వాహకులు ఉన్నారు. కొంత మంది స్వచ్చంధంగా స్వంత వాహనాల్లో తరలివచ్చినా...వారికి కావాల్సిన కనీస సదుపాయాలు అంటే భోజనం, తాగునీరు వంటివి అందించాలి. ఎవరికి వారు స్వంతగా ఖర్చు పెట్టుకోవాలని భావించినా పెద్దనోట్లను ఇప్పటికే హోటల్స్‌, ఆర్టీసీ వాళ్లు తీసుకోవడం లేదు. దీంతో సభకు ఎలా ప్రజలు ఎలా హాజరవుతారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తం మీద నోట్లు రద్దు 'పవన్‌' సభపై పడి సభ రద్దు అయినా అవవచ్చని పార్టీలో కొందరు అంటున్నారు. చూద్దాం...ఏమి జరుగుతుందో...?

(782)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ