WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వికటించిన ప్రయోగం...!ఆమె...అతడైతే...!

హీరో, హీరోయిన్‌గా తెరపై కనపడాలంటే చాలా కష్టం. ఇలాంటి కాన్సెప్ట్‌లతో చిత్రం భళారే విచిత్రం, భామనే సత్యభామనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆమె అతడైతే. ఇంటర్నేషనల్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న హనీష్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై డిగ్రీ చదువుకున్న ఒక మిడిల్‌క్లాస్‌ కుర్రాడు తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడనే పాత్రలో కనపడ్డాడు.
కథః
సుధాకర్‌(హనీష్‌) నెల్లూరు జిల్లాలోని ఓ పల్లెటూరు నుండి హైదరాబాద్‌కు కలెక్టర్‌ కావాలనే లక్ష్యంతో వస్తాడు. తనను కలెక్టర్‌గా చూడాలనుకునే తండ్రి కోరికను నేరవేర్చడానికి ఎంత కష్టమైన పడటానికి సిద్ధపడతాడు. తన ఫ్రెండ్స్‌ సలహాతో గ్రూప్స్‌ కోసం ప్రిపేర్‌ అయ్యే ముగ్గురు యువకులతో కలిసి ఉండటానికి ఒప్పుకుంటాడు. పల్లెటూరు నుండి రావడంతో ముందు ఇంగ్లీష్‌ రాక చాలా ఇబ్బందులు ఫేస్‌ చేస్తాడు. అయితే కోచింగ్‌ సెంటర్‌లో లక్ష్మి(చిరాశ్రీ) సహాయంతో స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కోర్సులో చేరి ఇంగ్లీష్‌పై పట్టు సాధిస్తాడు. ఈలోపు తండ్రి మరణం సుధాకర్‌ను కృంగదీస్తుంది. డబ్బులు కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాంతో తన రూంలో స్నేహితులకున్న అమ్మాయిల వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుని చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మాయి వేషం వేసి పని పిల్ల రాణిలా వారి రూంకు వస్తుంటాడు. ఇంతకీ సుధాకర్‌ ముగ్గురు ఫ్రెండ్స్‌ ఏమవుతారు? సుధాకర్‌ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? కలెక్టర్‌ అయ్యాడా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....చదువుకునే కుర్రాడు తన లక్ష్యం కోసం అమ్మాయిగా వేషం వేసి ఏమార్చడం అనే పాయింట్‌ బావుంది. కానీ గతంలో ఇదే పాయింట్‌పై వచ్చిన సినిమాల్లోని కామెడి ఈ సినిమాలో లేదు. ఉన్నంతలో అలీతో చేయించిన కామెడి పెద్దగా నవ్వించలేదు. కథను దర్శకుడు సూర్యనారాయణ గ్రిప్పింగ్‌గా నడిపించలేకపోయాడు. ఓ యువకుడు అమ్మాయిగా వేషం వేసుకున్నప్పుడు బావుంటాడు. మిగతా సమయంలో గడ్డం మీసాలతో ఉండటం అనేది లాజికల్‌గా కనపడదు. హీరో హీరోయిన్స్‌ మధ్య లవ్‌ సీన్స్‌ ఆకట్టుకోవు. సీన్స్‌ మధ్య పొంతన లేకుండా ఉంది. యశోకృష్ణన్‌ సంగీతం, హను కాక సినిమాటోగ్రఫీ బాలేవు.

(157)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ