WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌'పై ధ్వజమెత్తిన డా.సమరం...!

ప్రముఖ సెక్సాలజిస్ట్‌ డా.సమరం జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు 'పవన్‌కళ్యాణ్‌'పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'పవన్‌' స్థాపించిన పార్టీ వల్ల ఉపయోగం లేదని, ఆయనకు పార్టీ నడిపే శక్తిలేదని, ఆయనదంతా రాజరికపోకడలను విమర్శించారు. ఆయన స్థాపించిన పార్టీలో మిగతా వారంతా జీరోలేనని, అంతా ఆయన ఒక్కరే అనుకుంటున్నారని, అటువంటప్పుడు అది పార్టీ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 'పవన్‌' వ్యవహారశైలి అంతా సినిమాల్లో వలే ఉందని, సభకు రావడం ప్రసంగించడం...ముగించడం..వెళ్లిపోవడం..ఇదేనని..ఇదెక్కడి పార్టీ అంటూ ఆయన ప్రశ్నించారు. 'పవన్‌' తాను ప్రశ్నించడానికే ఉన్నానని చెబుతున్నారని...మరి 'జనం' వేస్తోన్న ప్రశ్నలకు 'పవన్‌' దగ్గర సమాధానం ఏదని ఆయన ప్రశ్నించారు. తనకు కులం లేదని 'పవన్‌' చెబుతున్నారని...2009లో 'చిరంజీవి' పార్టీ పెట్టినప్పుడు ఇదే విధంగా చెప్పారని...తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందికదా అని ఆయన అన్నారు. తనకు కలం,మతం లేదని 'చిరంజీవి' చెబితే తనలాంటి వారంతా 'ప్రజారాజ్యం' పార్టీలో చేరామని...చేరిన తరువాత ఎమ్మెల్యే సీటు మూడు కోట్లు, ఎంపి సీటుకు ఐదు కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు. 'చిరంజీవి'పార్టీ పెట్టినప్పుడు ఆయన కులానికి చెందిన వారు 95శాతం మంది ఆయన వెంట నడిచారని...కానీ అప్పట్లో వారు అధికారంలోకి రాలేకపోయారని, ఇప్పుడు 'పవన్‌'ను వారి కులస్తులే నమ్మడం లేదని ఇక ఆయన అధికారంలోకి రావడం కల్ల అని 'డా.సమరం' చెప్పారు. 'చిరంజీవి'కి ఉన్నంత బలం 'పవన్‌'కు లేదని...జనసేన వల్ల ఏమీ కాదని ఆయన అన్నారు. మొత్తం మీద గతంలో తను పార్టీలోకి ఆహ్వానించి అవమానించిన సంఘటనను 'డా.సమరం' ఇంకా మరిచిపోయినట్లు లేదు...అందుకే గతం తవ్వీ మరీ విమర్శిస్తున్నారు.

(4566)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ