WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో బద్దలు కానున్న బ్యాంక్‌ లాకర్స్‌....!

2017 మార్చి 31వ తేదీ లోపల లాకర్లలో ఉన్న బంగారం, వెండి, నగదు సొమ్ము వివరాలను రాబట్టేందుకు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారులు దాడులు చేయబోతున్నారు. స్థానిక అధికారులు అనగా రెవిన్యూ, పోలీసు యంత్రాంగం ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారులకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై పలు జిల్లాల కలెక్టర్లు తమ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగా ప్రతి లాకర్‌ నెంబర్‌కు నోటీసు ఇస్తారు..ఆ నోటీసుకు 15 రోజలు ఇస్తారు..ఈ గడువు లోపల...లాకర్లు ఉన్నవారు..తప్పనిసరిగా బ్యాంక్‌కు రావాలి...ఒకవేళ రాని పక్షంలో లాకర్లను బద్దలు కొడతారు..లాకర్‌లో పట్టుబడ్డ బంగారం, వెండి,నగదుకు వాస్తవ లెక్కలు చూపాలి. బంగారం కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదులు చూపించాలి. బంగారం, వెండి మా పూర్వీకులు ఇచ్చారని చెప్పినా...ఆదాయపుపన్ను అధికారులు అంగీకరించరు. దానికి కూడా సాక్ష్యాలు, రుజువులు చూపాలి..ఒక్కొక్క లాకర్‌లో 600 గ్రాముల లోపు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ బంగారం ఉంటే...తప్పనిసరిగా ఆధారాలు చూపాలి. ఎందుకైనా మంచిది..బ్యాంకులకు వెళ్లండి...అక్కడ ఏం జరుగుతుందో గమనించండి...అని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి. ఇంత వరకు ఆదాయపన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగలేదు. ప్రతి బ్యాంక్‌ ఎకౌంట్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయడంతో క్షణాల్లో డిపాజిట్లు, విత్‌డ్రాలు వివరాలు వారికి తెలిసిపోతాయి. దీంతో వారు వెంటనే దాడి చేసే అవకాశం ఉంది. కొన్ని గ్రామాలలో ఉన్న బ్యాంక్‌ బ్రాంచ్‌లలో లాకర్లు ఉన్నాయని...వాటిపై ముఖ్యంగా దృష్టిసారించాలని, పట్టణాలలో ఉన్న బ్యాంకుల లాకర్లపై రెట్టింపు నిఘా ఉంచాలని ఆదాయశాఖపన్ను అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారు ఎక్కడెక్కడ...ఎవరెవరికి ఎన్ని లాకర్లు ఉన్నాయో వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే అనేక మంది గ్రామీణ మహిళలు లాకర్లలలో తమ బంగార ఆభరణాలను దాచుకోవడం అఅయిపోయింది. ఇదే వారి పాలిట శాపం కానుంది. ఒక్కొక్క లాకర్‌లో 600 గ్రాములకు మించి ఉంటే దానికి ఆధారాలు చూపకపోతే ఆయా బంగార ఆభరణాలను, నగదును సీల్‌ చేయడం జరుగుతుంది. మళ్లీ ఆధారం చూపితే కానీ..ఆ సొమ్మును ఇవ్వరు. ఈ పరిస్థితి వారికి కలకముందే లాకర్‌లో ఉన్న బంగారాన్ని, లిక్విడ్‌ క్యాష్‌ను వెంటనే తీసుకోకపోతే కష్టాలు..నష్టాలు తప్పవు. ఇంతకు ముందు మొదటి నోటీసుకు సమాధానం చెప్పకపోయినా...హాజరు కాకపోయినా...రెండో నోటీసు...మూడో నోటీసు ఇచ్చేవారు..మళ్లీ అదే విధంగా ఇస్తారని భావిస్తే కొంప మునుగుతుంది. మొదటి నోటీసుకే హాజరు కావాలి...లాకర్లు తెరవాలి...అందులో ఉన్న బంగారం, వెండి, నగదు వివరాలను ఆధారాలతో అధికారులకు తెలియజేయాలి. కానీ..అటువంటి ఆధారాలు ఏ ఒక్కరికీ ఉండవు. ఒకవేళ బంగారానికి రసీదు ఉన్నా...ఆ రసీదులు ఎక్కడ ఉన్నాయో...వారికి తెలియదు. ఏదైనా బ్యాంక్‌లాకర్స్‌ ఉన్నవారికి బాధలు తప్పవు...!

(1320)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ