WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆట తరువాత...ముందు జాల్సా చేద్దాం...!

రాయల్‌ ఛాలెంజర్‌ జట్టు ఐపిఎల్‌లో పెద్దగా విజయాలేమీ సాధించకపోయినా ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం జల్సాలు, విందుల్లో ముందుంటున్నారు. ఒకరు బ్రేక్‌డాన్స్‌ చేస్తే మరొకరు గిటార్‌ వాయిస్తున్నారు..మరొకరు తీన్మార్‌ డాన్స్‌లు చేస్తున్నారు. జల్సా చేయడంలో, నైట్‌ అంతా పార్టీలో చిందులు వేయడంలో, తీన్మార్‌ డ్యాన్స్‌ చేయడంలో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ఆటగాళ్లకు మరెవరు సాటిరారనే చెప్పాలి. ఇరగదీసే స్టెప్పులు వేయడంలో విరాట్‌ కోహ్లి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇక కోహ్లికి సుడిగాలి లాంటి క్రిస్‌ గేల్‌ జతకలిస్తే.. షేన్‌ వాట్సన్‌ తన గిటారుతో దుమ్ములేపే ట్యూన్‌ ఇస్తే.. ఇక చెప్పాల్సిన పని లేదు. టాప్‌ లేచిపోద్ది. అలాంటి టాప్‌ లేచిపోయే డ్యాన్సులతో సుడి'గేల్‌', 'వీర' విరాట్‌ దుమ్ములేపారు.

(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ