WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతికి...కళా,అచ్చెన్న,కూనల అండ...!?

ఆయన అవినీతి నిరోధికశాఖ డిఎస్పీ స్థాయికి చెందిన అధికారి. అత్యంత నిజాయితీపరుడు, సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పనితీరును జిల్లా ముఖ్య అధికారులు కూడా మెచ్చుకున్నారు. ఉపకారవేతనాల కుంభకోణంతోపాటు, ఐటిడిఎ అధికారి అక్రమ ఆస్తుల కేసులో ఈ పోలీసు అధికారి కఠినంగా వ్యవహరించి నిజాలను నిగ్గు తేల్చారు. కుంభకోణానికి పాల్పడిన అందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించారు..గత ఐదేళ్లల్లో ఏయే బ్యాంకుల నుంచి ఎంతంత మళ్లించారో వివరాలను కూడా సేకరించారు. ఆ అధికారి పేరు రంగరాజు. ప్రస్తుతం శ్రీకాకుళం ఎసిబి డిఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉపకార వేతనాల కుంభకోణంలో అనేక మంది ఉద్యోగుల, అధికారుల పేరు బయటపెట్టిన ఘనత ఆయనదే. దీనిపై సంబంధిత అధికారులను అరెస్టు చేయడానికి రంగంసిద్ధమైంది. ఐటిడిఎ పిఒ వెంకట్రావు ఆస్తులపై దాడులు జరిపి కోట్లాది ఆస్తులు బయటపెట్టారు...ఇంతలో వెంకట్రావుకు అండగా ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కళావెంకటరావు, అసెంబ్లీ విప్‌ కోన రవికుమార్‌, మంత్రి అచ్చెంనాయుడులు వచ్చారట. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలువిషయం తెలియజేయకుండా 'రంగరాజు'ను ఈ ముగ్గురే బదిలీ చేయించారని జిల్లామొత్తం కోడై కూస్తోంది... ఇందులో తమకు ఎటువంటి సంబంధం లేదని వీరు బుకాయిస్తున్నప్పటికీ...వీరికి సంబంధం ఉందని అధికారపార్టీ నేతలు అంతరంగికంగా చెబుతున్నారు. అంతకు ముందు ఈ కేసును వదిలి వేయాలని డిఎస్పీ రంగరాజును ఇబ్బందులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఒకవైపు అవినీతిని అంతం చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు...మరోవైపు అవినీతిపరులను అరెస్టు చేస్తున్న అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. సిఎం చంద్రబాబును ఈ విషయంలో పైన చెప్పిన ముగ్గురూ తప్పుదారి పట్టించారని అధికార వర్గాలు అంటున్నాయి. కేసును పకడ్బందీగా రూపొందించి..ప్రభుత్వ ధనాన్ని దిగమింగిన రాబంధులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పాలకపార్టీ పెద్దలే...తెరవెనుక ఉండి...ప్రభుత్వాన్ని అటు పార్టీని భ్రష్టుపట్టించారని ఆ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నాయకులతో పాటు మరో సీనియర్‌ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారట.

(800)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ