WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మానవత్వం కోసం..భారతీయ మహిళ నగ్న ర్యాలీ...!

ఆమె భారతీయ మహిళ...ప్రపంచ దేశాలన్నీ భారతీయ మహిళలను గౌరవిస్తారు..అటువంటి భారతీయ మహిళ మానవత్వం, పర్యావరణ పరిరక్షణ కోసం నగ్నంగా ర్యాలీ నిర్వహించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితులను చేసింది. ఆమె పేరు..మీనాల్‌జైన్‌. భారతీయురాలైన ఈమె లండన్‌లో స్థిరపడ్డారు. ఆమె ఒక స్టాప్‌వేర్‌ కంపెనీకి యజమానురాలు కూడా. మనం పుట్టినప్పుడు వంటిపై బట్టలు లేవని...చనిపోయినప్పుడు కూడా బట్టలు ఉంచరని...నడిమధ్య బట్టలు ఎందుకు వేసుకోవాలని ఆమె నగ్నత్వాన్ని సమర్థించుకుంటుంది. అంతే కాకుండా ఇటీవల మెలబోర్న్‌లో 'మానవత్వం' కోసం అంటూ ఒంటిపై నూలుపోగు లేకుండా సైకిల్‌ ర్యాలీ నిర్వహించిదీ మహిళ. పర్యావరణాన్ని పరిరక్షించడానికి నగ్నంగా ర్యాలీలు నిర్వహించడానికి సంబంధం ఏమిటని కొందరు విసుక్కుంటున్నారు. అయినా ఆమె తాను చేసే పనులు చేస్తూనే ఉంది. అనేక సార్లు బీచ్‌లో నగ్నంగా సైకిల్‌ తొక్కి షాక్‌ ఇచ్చింది. అంతే కాకుండా నగ్నత్వం కోసమంటూ ఆమె ఒక సైట్‌ను నిర్వహిస్తోంది. ఏం చేస్తాం...ఎవరి ఆనందం..వారిది...మనమెవరం..కాదనడానికి...!

(3568)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ