WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

23న వైకాపాలో చేరనున్న 'కిరణ్‌కుమార్‌రెడ్డి'...!?

సమైక్యాంధ్రప్రదేశ్‌ చివరి సిఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ తన పాత బాస్‌ కుమారుని చెంతకే చేరబోతున్నారట. ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి సిఎంగా పనిచేసిన ఆయన అప్పట్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించి సోనియాగాంధీకి శత్రువయ్యారు. అంతే కాకుండా రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని, చివరి బాల్‌ మిగిలి ఉందని ఒకటే గప్పాలు కొట్టి చివరి నిమిషం వరకు సిఎం పదవిలో ఉన్నారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని ఆయన గట్టిగా చెప్పుకున్నారు. కానీ ఆయన చెప్పిందేమీ జరగలేదు...చివరకు రాష్ట్రం చీలిపోయింది. దరిమిలా 'కిరణ్‌' నూతన పార్టీని పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయించారు. కానీ..ఆయన అభ్యర్థులు ఎక్కడా విజయం సాధించకపోవడంతో చివరకు రాజకీయంగా తెరమరుగు అయ్యారు. విభజన జరిగి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్న సమయంలో ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన నియోజకవర్గ కార్యకర్తలు కోరుకుంటున్నారట.దీంతో మనోడు ఏ పార్టీ అయితే బాగుంటుందో...ఆలోచించి...చించి...చివరకు వైకాపానే తనకుసరైన పార్టీ భావించి ఆ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారట. మొదట ఆయన బిజెపిలో చేరదామని ప్రయత్నించినా అక్కడ ఆయన్ను పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడంతో చివరకు తన బద్దశత్రువైన ప్రస్తుత సిఎం చంద్రబాబు పార్టీలో చేరాలని కూడా అనుకున్నారట. అయితే అక్కడ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో తనకు ఉన్న ఏకైక దిక్కు వైకాపానే అని ఆయనకు బోధపడిందిట. దీంతో 'జగన్‌'తో తనకు సరిపడకపోయినా...ఏదో రకంగా ఆయనను బతిమిలాడి పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నీ కుదిరితే 23వ తేదీన వైకాపా జెండా కప్పుకోవడమే మిగిలింది. మొత్తంమీద ఒకప్పుడు 'జగన్‌'పై సోనియాగాంధీకి పితూరీలు చెప్పి...ఆయనకు దక్కాల్సిన సిఎం పదవిని ఒడిసి పట్టిన 'కిరణ్‌' ఇప్పుడు మళ్లీ 'జగన్‌' పంచన చేరడం అంటే విధివైచిత్రేనేమో...!

(2561)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ