WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భార్యపై అనుమానంతో...డ్రోన్‌తో వేధించిన భర్త...!(వీడియో)

అనుమానం పెనుభూతం...ఇది పెద్దలు చెప్పిన సామెత. అనుమానంతో సాగే సంసారం..మరిన్ని రోజుల సాగదని..చాలా మందికి అనుభవపూర్వకంగా తెలుసు. ఒకసారి అనుమానం వచ్చిందంటే ఆ సంసారంలో ఇక పొరపొచ్చలు వచ్చినట్లే...ఆ దాంపత్యం..ఎక్కువ కాలం నిలవడం కష్టమే...ఆస్ట్రేలియాకు చెందిన 'యాగ్‌' అనే వ్యక్తికి తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దాంతో ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని పలు ఆలోచనలు చేశాడు. చివరకు ఆయనేం చేశాడో తెలుసా...భార్య వెళుతున్న మార్గంలో ఓ డ్రోన్‌ను వినియోగించి ఆమె ఎక్కడకు వెళుతుందో...ఎవరితో మాట్లాడుతుందో...తెలుసుకున్నాడు. భార్య కారును వెంబడించిన డ్రోన్‌ ఆమె ఎవరితో మాట్లాడుతుందో...ఎప్పటికప్పుడు...'యాగ్‌'కు చేరవేసింది. ఆమె ఎవరో వ్యక్తితో కలసి వెళుతున్న దృశ్యాన్ని చూసిన అతను ...ఆమెకు వేరే వారితో సంబంధాలు ఉన్నాయని...ఆమెను వేధించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. 'యాగ్‌' చేసిన పనిపై కొందరు విమర్శలు చేయగా...మరి కొందరు అది సరైన పనే అంటూ సమర్థించారు. మొత్తం మీద గత 18 సంవత్సరాలుగా 'యాగ్‌' భార్య ఇదే విధంగా వ్యవహరిస్తుందట. చివరకు 'డ్రోన్‌' ఆమె బండారం బయటపెట్టిందని 'యాగ్‌' ఆరోపిస్తున్నారు.



(2696)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ