WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సెంచరీలతో అదరగొట్టిన 'పుజరా,కోహ్లీ...!

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఇంగ్లాండ్‌తో మొదలైన రెండవ టెస్టులో మొదటి రోజు భారత్‌ బ్యాట్స్‌మెన్‌ 'చటేశ్వర్‌ పుజారా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలు సెంచరీలతో అదరగొట్టారు. ఉదయం టాస్‌ గెల్చి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు మొదట్లో ఎదురు దెబ్బ తగిలింది. గాయంలో గత టెస్టుకు దూరమైన కె.ఎల్‌.రాహుల్‌ సున్నాకే బ్రాడ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. తరువాత మరో 16 పరుగులతో మరో ఓపెన్‌ విజయ్‌ కూడా అవుట్‌ అవడంతో భారత్‌ కష్టాల పాలయింది. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బ్యాట్స్‌మెన్‌ పుజారాలు ఆదుకున్నారు. ఇద్దరూ ఆచి తూచి ఆడుతూ ఇంగ్లాండ్‌ బౌలర్లను అడ్డుకున్నారు. ఇద్దరూ కలసి 3వ వికెట్‌కు 200పరుగులు జోడించారు. ఈ క్రమంలో 'పుజారా' 184 బంతుల్లో11ఫోర్లు రెండు సిక్స్‌లతో సెంచరీ సాధించాడు. టెస్టులో 11వ సెంచరీ చేసిన 'పుజారా' ఈ టెస్టులో 99 పరుగులపై ఉన్నప్పుడు సిక్స్‌ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ 12 ఫోర్లతో టీ తరువాత సెంచరీ చేశాడు. మొత్తం 154 బంతులను ఎదుర్కొన్న 'కోహ్లీ' టెస్టులో 13వ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ బ్రిటీష్‌ బౌలర్లను అల‌వోక‌గా ఎదుర్కొంటూ భారత్‌ను పటిష్టమైన స్థితిలో నిలిపారు.

(390)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ