WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవాస్తవాలు ప్రచురించే వెబ్‌సైట్స్‌కు యాడ్స్‌ ఇవ్వం...!

అవాస్తవ వార్తలు ప్రచురించే వెబ్‌సైట్స్‌ యాడ్స్‌ ఇవ్వమని సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌, ఫేస్‌బుక్‌లు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. సంచలనాల కోసం ప్రచురించే ఇటువంటి వార్తలను చదవి ప్రజలు తప్పుదోవలో నడుస్తున్నారని...ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో రెండు సంఘటనలు జరిగిపోయాయి. వాటి నుంచి గుణపాఠం నేర్చుకున్నాం...ఇక ఇలాంటివి జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నాం..విశ్వసనీయ వార్తలను అందించేందుకు ప్రయత్నిస్తాం...ఇందుకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సమాచారం విస్తృతంగా వ్యాప్తికావడంపై వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. అవాస్తవ వార్తలను ప్రచురించి పలు వెబ్‌సైట్లు, ప్రజాభిప్రాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి..దీంతో బోగస్‌ వార్తలు ఏవో...నిజమైన వార్తలు ఏవో తెలియక ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ తీసుకున్న నిర్ణయం వీటికి పుల్‌స్టాప్‌ పెడుతుందేమో చూడాలి మరి.

(400)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ