WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అప్పుడూ...ఇప్పుడూ..ఎప్పుడూ...ఆమెనే ప్రేమిస్తా:లోకేష్‌...!

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఓ విద్యార్థిని నుంచి అనుకోని ప్రశ్న వచ్చింది. 'కాలేజీలో రోజుల్లో మీరు ఎవరినైనా ప్రేమించారా...? అని 'అనూష' యువనేతను ప్రశ్నించింది.దీంతో ఆయన వెంటనే స్పందిస్తూ...తాను ఎప్పుడూ ఒకే అమ్మాయిని ప్రేమించానని...అప్పుడూ...ఇప్పుడూ...ఎప్పుడూ...ఆమెనే ప్రేమిస్తానని చెప్పారు. ఇంతకీ ఎవరా అమ్మాయి..అంటూ విద్యార్థులంతా ఆసక్తిగా ప్రశ్నించగా...ఆమె తన భార్య బ్రాహ్మిణి అని 'లోకేష్‌' ఉల్లాసంగా జవాబు ఇచ్చారు. అంతే కాకుండా దానిపై వివరణ ఇస్తూ...తాను 'బ్రాహ్మిణి' కలసి పెరిగామని..చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నాం...ఇప్పటికే మా పెళ్లి జరిగి పదేళ్లు అయింది...! అప్పటి నుంచి...ఇప్పటి వరకూ ఆమెనే ప్రేమిస్తున్నా...అంటూ ఆయన చెప్పారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో చదువుకున్న మీరు రాజకీయాల్లోకి రావడం వంశపార్యపరంగా జరిగిందా...లేక యాధృశ్చకమా...అన్న విద్యార్థి ప్రశ్న జవాబు ఇస్తూ...తాను మొదట హెరిటేజ్‌ కంపెనీలో పాలు,పెరుగు అమ్మానని, 2013 వరకు అవే బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. వైద్యుని కుమారుడు వైద్యుడు అయినట్లు రాజకీయ నాయకుల కుమారులు రాజకీయ నాయకులు అవడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. మీకు సిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి...కదా...ఒక వేళ మీరు సిఎం అయితే కులాల వారీగా ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తారా..అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ...ఇప్పుడు ఉన్న ఉద్యోగం పీకించవద్దని...రిజర్వేషన్లు అనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దనోట్లను రద్దు చేయాలని మొదట ప్రతిపాదించింది తెలుగుదేశం పార్టీనే అని...ఐదు సంవత్సరాల క్రితమే ఈ అంశంపై సిఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారని 'లోకేష్‌' చెప్పారు...అమెరికాలో కేవలం 100డాలర్లు నోటే పెద్ద నోటని...అక్కడ 10,20 డాలర్ల నోట్లు అధికంగా చెలామణిలో ఉంటాయని మన దగ్గర మాత్రం 85శాతం 500,1000నోట్లు ఉన్నాయని వీటి వల్ల నల్లధనం పెరిగిపోతుందని ఆయన అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా 2వేల రూపాయల నోటును తెస్తుందని..దాన్ని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల ధరలు తగ్గుతాయని, వడ్డీరేట్లు,పన్నుభారం తగ్గుతాయని ఆయన అన్నారు.

(849)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ