WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ప్రభాస్‌' అంటే నాకు ఇష్టం...!

తెలుగు సినీ హీరో 'ప్రభాస్‌' అంటే తనకు చాలా ఇష్టమని బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల చెబుతోంది. ముఖ్యంగా అతని హైట్‌ అంటే తాను పడిచచ్చిపోతానని చెబుతోంది. తెలుగు సినిమా హీరోల్లో అందరికంటే అందగాడు...మంచి పొడుగు ఉన్న హీరో 'ప్రభాస్‌' అని ఆమె అంటోంది. అతను కాక తనకు హీరో నితిన్‌ చాలా క్లోజ్‌ అని చెబుతోంది. తాను సరదాగా సినిమా చేస్తాను..అంటే తనకు వెంటనే సినిమాలో నటించే అవకాశం 'నితిన్‌' ఇప్పించాడని...మురిసిపోతోంది. ప్రభాస్‌, నితిన్‌ కాక 'నాని' అంటే కూడా ఇష్టం బాగుందని...అతని నటన బాగుంటుందని చెబుతోంది. సింధు,సానియాను బాగా సఫోర్ట్‌ చేశారని, తనను మాత్రం ఎవరూ ప్రోత్సహించలేదని వాపోయిందీ చిన్నది. కోచ్‌ గోపీచంద్‌తో తనకు ఎటువంటి గొడవలు లేవని, ఆయన సింగిల్స్‌ను మాత్రమే పట్టించుకుంటారని, డబుల్స్‌ను అసలు పట్టించుకోరని ఆమె ఆరోపించారు. అంతే తప్ప తనకు 'గోపీ'కి మధ్య మరేమీ లేదని అన్నది 'జ్వాల'. తాను స్వయం కృషితో పైకి ఎదిగానని, సింధుకు అందరూ సఫోర్ట్‌ చేశారని చెబుతోంది. 'సింధు' బాగా కష్టపడిందనడంలో సందేహం లేదు..కానీ...ఆమెకు దక్కిన ప్రోత్సాహం తనకూ దక్కితే తాను పతకం తెచ్చేదానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. ఏది ఏమైనా...ఆటతో పాటు సినిమా వాళ్లతో సంబంధాలతో 'గుత్తాజ్వాల' బాగానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.

(499)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ