WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సింగపూర్‌ హోటల్‌పై 'లోకేష్‌'కు సూటి ప్రశ్న...!

ఇన్నాళ్లూ ప్రతిపక్షపార్టీలు చేస్తోన్న అవాస్తవ విమర్శలను రాష్ట్రంలోని విద్యార్థులు కూడా బాగానేనమ్మినట్లున్నారు. సిఎం చంద్రబాబుకు సింగపూర్‌లో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఉందని, ఆయన బ్లాక్‌మనీ అంతా ఇక్కడే ఉందన్న ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మిన విద్యార్థుల ఈ విషయంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను నిలదీశారు. శనివారం నాడు నెల్లూరులోని నారాయణ కాలేజీలోని విద్యార్థులతో ఆయన ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా 'భావన' అనే విద్యార్థిని 'లోకేష్‌'ను సూటిగా ప్రశ్నించింది. 'మీకు సింగపూర్‌లో హోటల్‌ ఉంది కదా...? అని ఆమె నిలదీసింది. దీంతో ఆయన స్పందిస్తూ...అవన్నీ ప్రతిపక్ష వైకాపా చేస్తోన్న ప్రచారం తప్ప వేరే ఏమీ లేదు...నిజంగా హోటల్‌ ఉంటే అదివాళ్లకే రాసిస్తామని కానీ..వాళ్లు ముందుకురాలేదని ఆయన తెలిపారు. విషప్రచారాన్ని నమ్మవద్దని...జైలుకు వెళ్లి వచ్చిన వారి మాటలు నమ్మితే మోసపోతారని ఆయన ఆ విద్యార్థికి హితవు పలికారు. కీ.శే.ఎన్టీఆర్‌, చంద్రబాబుల నుంచి ఏం నేర్చుకున్నారని మరో విద్యార్థి ప్రశ్నించగా వారి నుంచి కష్టపడే తత్వాన్ని నేర్చుకున్నానని చెప్పారు. వారానికి ఐదు రోజులు పార్టీ కోసం శ్రమిస్తున్నానని, ఆయన తెలిపారు. ఓటుకు నోటు కేసులో 'రేవంత్‌రెడ్డి'ని ఎందుకు అరెస్టు చేయలేదన్న విద్యార్థుల ప్రశ్నకు స్పందిస్తూ 'రేవంత్‌రెడ్డి' తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని, లేకపోతే లేదని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వల్లే ఎక్కువ లాభమని ఆయన అన్నారు.

(1345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ