లేటెస్ట్

'విజయసాయిరెడ్డి' కుల వ్యాఖ్యలపై అభ్యంతరం...!

వైకాపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' తాజాగా టివి9 'రవిప్రకాష్‌'నుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా హుందాగా వ్యాఖ్యానించాల్సిన 'విజయసాయిరెడ్డి' కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ...విమర్శల పాలవుతున్నారు. 'టివి9' నుంచి 'రవిప్రకాష్‌'ను తొలగించిన వైనంపై ఆయన స్పందిస్తూ...'మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి 'రవిప్రకాష్‌' బండారం బయటపడింది.ఈయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. 'కమ్మ'ని నీతులకు కాలం చెల్లింది. 'చంద్రబాబు' ప్రయోగించిన తుప్పుపట్టిన మిసైళ్లల్లో 'రవిప్రకాష్‌' ఒకరు అంటూ..ట్విట్‌ చేశారు.దీనిపై..రాజకీయ, సామాజికవర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఒక కులంలోని వ్యక్తి తప్పు చేస్తే..ఆ తప్పును ఒక కులానికి మొత్తానికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నిస్తున్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన 'విజయసాయిరెడ్డి' 'జగన్మోహన్‌రెడ్డి'ల గురించి..అదే విధంగా కులపరంగా వ్యాఖ్యానిస్తే..సంస్కారంగా ఉంటుందా..? వీరిద్దరు చేసిన అవినీతిని వారి సామాజికవర్గానికి అంటగడితే..వాళ్లు ఒప్పుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి 'విజయసాయిరెడ్డి' ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, గతంలో 'పవన్‌కళ్యాణ్‌'ను ఉద్దేశిస్తూ..'ఉల్లిపాయ' అంటూ వ్యాఖ్యానించి..కులాన్ని ఆపాదించారని, ఇప్పుడు 'రవిప్రకాష్‌' విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తూ..ఆయా కులాలను కించపరుస్తున్నారని, ఆయన ఇటువంటి తప్పుడు విధానాలు మానుకోకపోతే బుద్ది చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని, ఆయా సామాజికవర్గాలకు చెందిన ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.మరి ఇప్పటికైనా..ఆయన తన వైఖరిని మార్చుకుంటారా..? లేక మరింత దూకుడుగా 'కుల' వ్యాఖ్యలు చేస్తారా..వేచి చూడాల్సిందే...!

(888)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ