లేటెస్ట్

'చంద్రులిద్దరూ' చక్రం తిప్పుతారట...!?

ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు 'కెసిఆర్‌, చంద్రబాబు'లు చక్రం తిప్పుతారని 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ తన వీకెంట్‌ కామెంట్‌లో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి 'కె.చంద్రశేఖర్‌రావు' కాంగ్రెస్‌ పక్షాన చేరుతున్నారని, ఆయన బిజెపిని వంచించారని, తాజాగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆయన తనకు వచ్చే 15సీట్లతో పాటు, వైకాపాకు వచ్చే సీట్లు, డిఎంకెకు వచ్చే సీట్లు కలుపుకుని కేంద్రంలో కాంగ్రెస్‌తో బేరాలు ఆడతారని, ఆయన ఉపప్రధాని పదవిని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 'కెసిఆర్‌' ఉపప్రధాని అయితే 'చంద్రబాబు' కూడా సహకరిస్తారని 'ఆర్‌.కె' పేర్కొన్నారు. 'కెసిఆర్‌' అంటే పడని 'చంద్రబాబు' ఆయన ఉపప్రధాని అయితే సహకరిస్తారని చెబుతున్నారు. అదే సమయంలో ఆంధ్రాలో వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తే...'జగన్‌' తన మాట వినరనే భయం 'కెసిఆర్‌'కు ఉందని, అయితే ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా వినక తప్పని పరిస్థితి ఉంటుందని 'కెసిఆర్‌' అంచనా వేస్తున్నారట. తనకు ఉపప్రధాని పదవి ఇస్తే...కాంగ్రెస్‌కు సహకరించేందుకు 'కెసిఆర్‌' సిద్ధంగా ఉన్నారని, అదే సమయంలో 'రాహుల్‌గాంధీ'కి సహకరిస్తున్న 'చంద్రబాబు' 'మోడీ' ఓటమిని కోరుకుంటున్నందున ఆయన కూడా 'కెసిఆర్‌'తో కలసిపోతారని దీంతో..మళ్లీ 'చంద్రులిద్దరూ' చక్రం తిప్పుతారని 'ఆర్‌.కె' తన వీకెంట్‌ కామెంట్‌లో పేర్కొన్నారు. నిన్న మొన్నటి దాకా...ఉప్పూ నిప్పూలా ఉన్న 'చంద్రబాబు', కెసిఆర్‌'లు మళ్లీ కలుస్తారని, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న అలజడి దీంతో సద్దుమణుగుతుందని ఆర్‌కె చెప్పుకొచ్చారు. మొత్తం మీద అటు తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకుంటూనే తన స్వామి 'చంద్రబాబు'ను కూడా 'ఆర్‌కె' బాగానే వెనుకేసుకొస్తున్నారు. మరి చూద్దాం...ఆర్‌.కె.పలుకులు ఎంత వరకు నిజం అవుతాయో..?

(598)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ