WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పగలు కూడా మహిళలు నైటీలతో తిరుగుతారా...?

సినీ నటుడు ఉత్తేజ్‌ మహిళల వస్త్రధారణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు వేసుకునే నైటీల గురించి...ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లు రాత్రిపూట నైటీలు ధరించడం వరకు ఓకే...కానీ...పగలు కూడా నైటీలతో తిరగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొంత మంది పగలు నైటీలతోనే స్కూటీలు డ్రైవ్‌ చేస్తున్నారని ఇది సమంజసమేనా...?..ఈ ప్రశ్నలో వారి జాగ్రత్త కూడా దాగుందని ఆయన చెప్పారు. నైటీలు సాంప్రదాయవిరుద్దమా...? కాదా? అనేది పక్కన పెడితే పగలు కూడా నైటీలు వేసుకోవడం పైనే తన అభ్యంతరాలని ఆయన చెప్పారు. ఇక మహిళలు ఎక్కువ సేపు ఫోన్లతో గడుపుతున్నారని, ఫేస్‌బుక్‌, వాట్సప్‌లతో కాలం గడుపుతున్నారని...ఒక వైపు ఫోన్లతోనే సమయం అంతా గడుపుతున్న మహిళలు మళ్లీ పిల్లలు ఫోన్‌ తీసుకుంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ముందు వీళ్లు సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. 'ఉత్తేజ్‌' చేసిన వ్యాఖ్యలపై మహిళల రియాక్షన్‌ ఎలా ఉంటుందో కానీ...అసలు హఠాత్తుగా మహిళల నైటీల గురించి 'ఉత్తేజ్‌' మాట్లాడడానికి సందర్భం ఏమిటో...? మరి 'ఉత్తేజ్‌'కే తెలియాలి...!

(902)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ