WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జూ.ఎన్టీఆర్‌ ఎవరో ఆ దర్శకుడికి తెలియదట...?

దక్షిణాది సినీరంగంలో ఎన్టీఆర్‌ పేరు తెలియని సినీ అభిమానులు ఎవరైనా ఉన్నారా...? అంటే సహజంగా లేదనే సమాధానం వస్తుంది. అటువంటిది ఒక సీనియర్‌ దర్శకుడికి జూ.ఎన్టీఆర్‌ అంటే ఎవరో తెలియదట...? ఆశ్చర్యంగా ఉందా...? అయితే ఈ కథనం చదవండి. 'సింగం' సినిమా సిరీస్‌ ద్వారా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు...'హరి'కి జూ.ఎన్టీఆర్‌ అంటే ఎవరో తెలియదట. ఓ తమిళ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చాడు. జూ.ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారని అడగగా...జూ.ఎన్టీఆర్‌ ఎవరు..? అని ప్రశ్నించారట. దీనితో అవాక్కు అవడం ఆ జర్నలిస్టు వంతు అయిందట. తెలుగులో పలు సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి పెద్ద ఎన్టీఆర్‌కు వారసుడిగా పేరుగాంచిన జూ.ఎన్టీఆర్‌ తెలియకపోవడం ఏమిటని వారు అంటున్నారట. ఇదంతా కావాలనే ఆ దర్శకుడు చెబుతున్న మాట అని..అతను వేరే ఉద్దేశ్యంతో ఆయన ఎవరో తెలియదని అన్నారని చెబుతున్నారు. గతంలో ఇదే దర్శకుడు ఎన్టీఆర్‌తో సినిమా కోసం ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలో ఆ కోపాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్‌ ఎవరో తెలియదన్న దర్శకుడిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు.

(533)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ