WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మెగా' వారసుడు...సాయిధరమ్‌తేజ్‌....!

జబర్ధస్త్‌' యాంకర్‌...ఇప్పుడిప్పుడే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్న 'అనసూయ' మెగాస్టార్‌ 'చిరంజీవి' వారసుడు ఎవరో అప్పుడే ప్రకటించేసింది. 'మెగా' కుటుంబంలో అరడజను మంది హీరోలు ఉంటే వారిలో 'సాయిధరమ్‌తేజ్‌' మాత్రమే 'చిరంజీవి' వారసుడని స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. 'సాయిధరమ్‌తేజ్‌' తాజా చిత్రం 'విన్నర్‌'లో 'అనసూయ' ఓ స్పెషల్‌ సాంగ్‌లో అతనితో ఆడిపాడింది. ఈ సందర్భంగా 'సాయిధరమ్‌తేజ్‌'తో ఎలా ఉందని ప్రశ్నించగా...టోటల్‌గా స్టన్నింగ్‌,అమేజింగ్‌, వెరీ డెడికేటెడ్‌ యాక్టర్‌ అంటూ కితాబులు ఇస్తోంది. అతనితో డాన్స్‌ చేయడం చాలా కష్టం...ఆ స్పీడ్‌ను తట్టుకోలేకపోయాను..'చిరంజీవి' కన్నా చాలా స్పీడ్‌గా చేస్తున్నాడు...అతని వేగాన్ని అందుకోవడం...నావల్ల కాలేదు...అంటూ ఒకటే చెబుతోంది. మరి అంత స్పీడ్‌ 'సాయి' ఎక్కడ చూపించాడో...ఏమో...!.పదిరోజుల పాటు ఫారిన్‌లో అతనితో షూటింగ్‌ చేశారు...అయినా అతనికి అల‌స‌టే లేదు..పనిపైనే అతనికి ధ్యాస...నిజంగా అతను 'మెగా' వారసుడే...! మొత్తం మీద 'అనసూయ' తెలివికలదే...వరుస హిట్‌లతో అదరగొడుతున్న 'సాయి'ని బుట్టలో వేస్తే తనకు మరిన్ని అవకాశాలు ఇప్పిస్తాడనే ఈ కితాబులు ఇచ్చేస్తుందేమో...ఈ ముదురు ఆంటీ...!

(190)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ