WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజ్‌తరుణ్‌'తో డేటింగ్‌ చేస్తానన్నా.....?

            'కుమారీ 21ఎఫ్‌'తో తెలుగులో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హెబ్బాపటేల్‌...తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇప్పుడు ఆమె నటించిన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో అమ్మడి ఆనందానికి హద్దులే లేవు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆమె వివరణ ఇస్తుంది. అప్పట్లో మీరు ఎవరితో డేటింగ్‌ చేస్తారని ప్రశ్నించగా వెంటనే 'రాజ్‌తరుణ్‌' అని చెప్పేశా...? అది సీరియస్‌గా చెప్పిన మాట కాదు...! దాంతో 'నేను...రాజ్‌తరుణ్‌' డేటింగ్‌ చేస్తున్నామని ప్రచారం చేశారు. అయితే అది నిజం కాదు..అదే విధంగా తనకూ 'రాజ్‌తరుణ్‌'కు మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమే. అయితే తరువాత అవన్నీ సర్దుకున్నాయి. జర్నలిస్టుగా పనిచేస్తూ సినిమా హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం ఆనందంగానే ఉంది. 

          నాపై సెక్సీడాల్‌ అనే ముద్రపడడం బాధ కల్గిస్తుంది. 'నేను ఓవర్‌గా ఎక్కడా ఎక్స్‌పోజ్‌ చెయ్యలేదు..కానీ 'జనం' అపిలిస్తే ఏం చేస్తాం...వాళ్ల ఇష్టం..ఇక. తెలుగు సినిమాలు వరుసగా చేసుకుంటూ పోతున్నా తెలుగు అంతగా రావడం లేదు..ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతుంది. 'వరణ్‌' గాయపడడంతో 'మిస్టర్‌' బాగా లేటవుతోందని ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలే తనకు ఎక్కువగా రావడం అంతా యాదృశ్చకమేనని అంటోంది. 'నాన్న...నేను..నా బాయ్‌ఫ్రెండ్స్‌' టైటిల్‌ మార్చడం వెనుక దిల్‌రాజుగారు ఉన్నారు. ఆయనే టైటిల్‌ బాగాలేదని మార్పించారని చెబుతోంది హెబ్బాపటేల్‌.


(743)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ