లేటెస్ట్

మేము సమర్థించలేం బాబోయి....!

'మబ్బులు'...అడ్డం ఉన్నాయి..పాకిస్తాన్‌ రాడార్లు మన విమానాలను గుర్తించలేవు...వెంటనే దాడి చేయమని చెప్పానన్న' ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నెట్‌జెన్‌లు 'మోడీ'పై వ్యంగ్యవ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరూ దీనిపై కామెంట్లు పెడుతున్నారు. 'మోడీ' ఐదేళ్ల నుంచి ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టలేదో ఇప్పుడు తెలిసింది...? తాను నోరు విప్పితే...ఎక్కడ దొరికిపోతాననే భయంతోనే...ప్రెస్‌మీట్‌ పెట్టలేదని ఒక నెట్‌జెన్‌ వ్యాఖ్యానించాడు...! ఇప్పటికైనా అర్థం అయిందా...? పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు...మన పెద్దలు గొడుగు వేసుకుని ఎందుకు వెళ్లమంటారో...? 'రాడార్ల'కు దొరక్కుండా ఉండేందుకే...!? ఎండగా ఉన్నప్పుడు 'భల్లాలదేవుడు..బాహుబలి'పైకి యుద్ధానికి వెళ్లాడు..వర్షం పడేటప్పుడు వెళితే...మబ్బులు ఉండేవి.. యుద్ధం గెలిచేవాడు...పిచ్చిగన్నయ్య...ఇలా ఒకటా రెండా...సోషల్‌మీడియా మొత్తం...'మోడీ' చేసిన వ్యాఖ్యలపై హోరెత్తిస్తోంది. 

ఈ వ్యాఖ్యలే కాదు..తాను 1988లోనే డిజిటల్‌ కెమెరాతో ఫోటోలు తీసి..ఈమెయిల్‌ చేశాన్నవ్యాఖ్యలపై కూడా సోషల్‌ మీడియా ఎద్దేవా చేస్తోంది. డిజిటల్‌ కెమెరా ఎప్పుడు వచ్చింది...దేశంలోకి ఈమెయిల్‌ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో డేట్లుతో సహా వేసి..ప్రధాని మోడీని ఎద్దేవా చేస్తున్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ ట్రోలింగ్‌ ఇంకా ఆగలేదు. ఈ ట్రోలింగ్‌ దెబ్బకు 'మోడీ' చేసిన వ్యాఖ్యలను బిజెపి అధికార సైట్‌ను ఆ పార్టీ తీసివేసింది. మరో వైపు...'మోడీ' వ్యాఖ్యలను సమర్థించలేక...బిజెపి సోషల్‌మీడియా సైలెంట్‌ అయింది. సోషల్‌మీడియాలో పెయిడ్‌ ఆర్ఠిస్టులతో యాక్టివ్‌గా ఉండే 'మోడీ' భక్తులు ఎవరూ వీటిని ఖండించిన పాపానపోలేదు. ఆయనను నిత్యం..ఇంద్రుడు... చంద్రుడు..అని కీర్తించే వెబ్‌సైట్లు, ఇతరత్రా మీడియా కిక్కురమనడం లేదు. 'మోడీ'లో ఎంత పస ఉందో...దీనిని బట్టి తెలుస్తుందని, ఆయనను అడ్డగోలుగా సమర్థించే వ్యక్తులు కూడా..తాజాగా నోరుళ్లెబెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఆఖరులో ఇలా 'మోడీ' నోరు తెరిచి తన పాండిత్యం చూపించారని, అదే మొదటిలోనే...నోరు తెరిస్తే...ఎన్నికల ముందే 'బిజెపి' బిచాణా ఎత్తేసేదని...రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద..'మోడీ' మబ్బుల వ్యాఖ్యలు.. ఆయన అవగాహనారాహిత్యాన్ని తేటతెల్లం చేస్తే...ఇటువంటి వ్యక్తినా..ఇన్నాళ్లు 'ఆహా..ఓహో..' అంటూ మోసిందని కొందరు బిక్కమోహం వేస్తున్నారు. 

(215)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ