WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మెగా' హీరోకు గాలం వేస్తున్న 'రకుల్‌'...!

'మెగాస్టార్‌' 'చిరంజీవి' మేనల్లుడు 'సాయిధరమ్‌ తేజ్‌'కు హీరోయిన్‌ 'రకుల్‌ప్రీతిసింగ్‌' గాలమేస్తుందట. ఈ విషయంపై టాలీవుడ్‌ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 'సాయి' 'రకుల్‌' ఇద్దరూ కలసి నటిస్తున్న తాజా చిత్రం 'విన్నర్‌' ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటీవల వీరు ఫారిన్‌ ట్రిప్‌ వేశారు. ఈ పర్యటనలో షూటింగ్‌తోపాటు ఇద్దరూ కలసి షాపింగ్‌ కూడా చేశారట. అంతే కాదు...వారిద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యారట. అయితే హీరో,హీరోయిన్లు క్లోజ్‌గా ఉండడం సినిమా ఇండస్ట్రీలో సహజమే. అయితే ఈ సాన్నిహిత్యం...కేవలం ఫ్రెండ్‌షిపే కాదట. వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందంటే..'రకుల్‌' పర్స్‌లో 'సాయి' ఫోటో ఉండేంతట. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సినిమా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వరుసగా సూపర్‌హిట్‌లు కొడుతున్న 'సాయి' ఇప్పటికే 'రెజీనా'తో ప్రేమలో పడడం..విడిపోవడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు మనోడు 'రకుల్‌' వెంటపడుతున్నారని సినీవర్గాల టాక్‌. అయితే 'సాయి' వెంటే...'రకుల్‌' పడుతుందని 'మెగా' వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వారు అంటున్నారు.


(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ