WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బన్నీ'కి చెక్‌ పెట్టిన 'పవన్‌'...!

మెగా హీరోల కోల్డ్‌వార్‌ ఇప్పుడు బహిర్గతం అవుతోంది. ఇన్నాళ్లూ ఉప్పు..నిప్పులా ఉన్న 'బన్నీ' పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌లు ఇప్పుడు తాడో..పేడో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇటీవల కాలంలో ఈ మెగా హీరోలిద్దరి మధ్య సఖ్యత లేని సంగతి తెలిసిందే. పలు బహిరంగ సభల్లో 'పవన్‌' గురించి తాను మాట్లాడనని...'బన్నీ' అనడం...దానికి స్పందనగా 'పవన్‌' అభిమానులు...'పవన్‌' జిందాబాద్‌ అనే నినాదాలు...ఇవ్వడం..దానికి కౌంటర్‌గా అభిమానులనుద్దేశించి...'గుమ్మనండవోయి' అని విసుక్కోవడం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇటువంటి సంఘటనల వల్ల ముదిరిపాకానపడ్డాయి. దీంతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారట. 

       తాజాగా 'బన్నీ' సినిమా... 'డిజే..దువ్వాడ..జగన్నాథం' సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడానికి 'పవన్‌' ప్రయత్నాలు చేస్తున్నారట. 'బన్నీ' ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అయితే దీన్ని అడ్డుకునేందుకు 'పవన్‌' తన మేనల్లుడు 'సాయిధరమ్‌తేజ్‌' సినిమా 'విన్నర్‌'ను ఫిబ్రవరిలో విడుదల చేయించడానికి పూనుకున్నాడట. జనవరిలో 'చిరంజీవి' 150వ చిత్రం విడుదల కానుండగా...ఫిబ్రవరిలో 'విన్నర్‌' విడుదల చేయించాలని, మార్చిలో తన చిత్రం'కాటమరాయుడు' విడుదల చేయిస్తే...ఇక బన్నీ జూన్‌ వరకు ఆగాల్సిందేనన్నది 'పవన్‌' వ్యూహమట. ఏప్రిల్‌లో ప్రసిద్ధిచెందిన చిత్రరాజం 'బాహుబలి-2' విడుదల కానుంది. దీంతో ఈ నెలలో కూడా 'బన్నీ' కి అవకాశం లేదు. తరువాత 'మే'లో 'మహేష్‌బాబు' చిత్రం విడుదల ఉంది. దీంతో...'బన్నీ' జూన్‌దాకా తన చిత్రాన్ని విడుదల చేయకుండా వాయిదా వేసుకోవాల్సిందేనట. తాజా సమాచారం ప్రకారం ఇదంతా ఒక పక్కా పథకం ప్రకారం జరుగుతుందని 'పవన్‌' క్యాంప్‌ చెబుతోంది. మరి దీనికి విరుగుడుగా 'బన్నీ' శిబిరం ఏం చేస్తుందో...చూడాల్సి ఉంది.


(442)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ