'పూర్ణ' హోమ్లీగా ఉండే హీరోయిన్. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించి పేరు తెచ్చుకున్న ఈ సుందరి అసలు పేరు 'పూర్ణ' కాదట. వాస్తవానికి ఆమె హిందువని ఇప్పటిదాకా ప్రేక్షకులు భావించే వారు...కానీ తను ముస్లిం అట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. తన అసలు పేరు...'షామ్నాకాసిం'..స్వచ్ఛమైన ముస్లిం యువతి. అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆమె పేరును 'పూర్ణ'గా మార్చారట దర్శకులు. 'సీమటపాకాయ్, అవును చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఆమె ఇటీవల శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన 'జయమ్ము...నిశ్చంబురా' చిత్రంలో నటించింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలపై విపులంగా మాట్లాడింది.
ముస్లిం యువతిగా ఉండి హీరోయిన్ కావడం సామాన్యమైన విషయం కాదని...తన కుటుంబ సభ్యులు తాను సినిమాల్లో నటించడానికి పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పింది. అంతే కాకుండా డ్రస్ విషయం, ఎక్స్పోజింగ్ విషయంలోనూ వారు కొన్ని షరతులు విధించారని, అయినా తాను వాటిన్నింటిని తట్టుకుని సినిమాల్లో నటిస్తున్నాని చెప్పుకొచ్చింది. 'సీమటపాకాయ్' సినిమాలో 'అ నరేష్'తో చేసిన 'లిప్‌లాక్' సన్నివేశంపై తమ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారని...ఇటు వంటి సన్నివేశాలు చేయవద్దని గట్టిగా చెప్పారట. ఆ సీన్ చూసిన ఆమె అన్నయ్య చాలా ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ సీన్ చూసిన మా అన్నయ్య ఫ్రెండ్ దాని గురించి చాలా అసభ్యంగా మాట్లాడాట. దీంతో 'అన్నయ్య' తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతోంది 'పూర్ణ'. అయితే ఇటీవల విడుదలైన 'జయమ్ము.. నిశ్చయంబురా'లో సంసారపక్షంగా ఉందని అందరూ అభినందిస్తున్నారని చెబుతోందీ సుందరి.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ