లేటెస్ట్

ప్రమోషన్లలో రూ.7కోట్లు చేతులు మారాయా...!?

సార్వత్రిక ఎన్నికల సమయంలో...అధికారగణం ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతితోనే తలపట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కొందరు ఐఎఎస్‌ అధికారుల అవినీతి చూసి..దిమ్మతిరిగి పోయిందట. ఎన్నికల సమయానా..నిబంధనలను అడ్డుపెట్టుకుని...కొందరు సీనియర్‌ ఐఎపస్‌ అధికారులు చేయకూడని పనులు చేసి.. కోట్ల అవినీతికి పాల్పడ్డారని తాజాగా ప్రచారం జరుగుతోంది. రైతులకు దగ్గరగా ఉండే శాఖలో....కొందరు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చినందుకు దాదాపు రూ.7కోట్ల రూపాయలు చేతులు మారాయని... ఆశాఖలో ప్రచారం జరుగుతోంది. ఈ శాఖ కార్యదర్శి, కమీషనర్‌, ముఖ్యమైన అధికారులు...కొందరు శాఖలో ఎప్పడి నుంచో పెండింగ్‌లో ఉన్న అధికారులకు ప్రమోషన్లు కల్పించి..వారి వద్ద నుంచి రూ.7కోట్లు వసూలు చేశారని సచివాలయంలో చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో శాఖ కార్యదర్శి, కమీషనర్‌లు ప్రధాన భాగస్వాములని, ప్రమోషన్లు పెండింగ్‌లో ఉన్న అధికారులతో వారి మనుషులు నేరుగా మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నారని తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ శాఖ అధికారిని ఎంతో అభిమానించే వారని, ఆయన సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేస్తారని పలు బాధ్యతలు అప్పచెప్పారని,  దాన్ని అలుసుగా తీసుకున్న ఆ శాఖ కార్యదర్శి తన అసలైన రూపాన్ని బయటపెెట్టి, విచ్చలవిడి అవినీతికి తెరతీశారని ఆశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. శాఖ కార్యదర్శితో పాటు కమీషనర్‌ కూడా ఈ దోపిడిలో భాగస్వామి అని..చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీరిద్దరికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి కీలకమైన శాఖలను అప్పగిస్తే...అవినీతికి పాల్పడింది కాక..ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి గెలుస్తున్నారని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తాము కీలకమైన స్థానాల్లోకి చేరుతామని చెబుతున్నారట. 'చంద్రబాబు' ఓడిపోతున్నారు..? వచ్చేది 'జగనే'నని...వారు తమతో మాట్లాడిన వారితో వ్యాఖ్యానిస్తున్నారట. ఈ శాఖలో ప్రమోషన్ల విషయంలో గతంలోనే రచ్చ జరిగిందని, అయితే ఎన్నికల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా...నిర్ణయాలు తీసుకుని సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత...'చంద్రబాబు' మళ్లీ అధికారంలోకి వస్తే..వీరి సంగతి తేలుస్తారని, ఒకవేళ ఆయన రాకుంటే...మాత్రం వీరు మరింత రెచ్చిపోయి అవినీతికి తెగబడతారని శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. 

(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ