బాలీవుడ్ నటి 'విద్యాబాలన్' చాలా డేరింగ్. మనసులో ఉన్న మాట వెంటనే బయటకు చెప్పేస్తుంది. ఇది చెప్పవచ్చా...? లేదా...? అనేది ఆలోచించకుండానే తాను అనుకున్నది అనుకున్నట్లు చెబుతోంది. ఇటీవల కొందరు విలేకరులు ఆమెతో పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా 'డేటింగ్' గురించి చర్చ వచ్చింది. వెంటనే 'విద్యాబాలన్' అందుకుని తాను పెళ్లికి ముందే కొందరి వ్యక్తులతో డేటింగ్ చేశాని చెప్పేసింది. దీంతో అవాక్కు అవడం విలేకరుల వంతు అయింది. ఎందుంటే ఏ అమ్మాయి అయినా...తనకు పెళ్లికి ముందు ఎటువంటి ఎఫైర్లు లేవని కలరింగ్ ఇస్తుంటారు..ముఖ్యంగా సినిమాతారలు ఈ విషయంలో రెండాకులు ఎక్కువ చదివారు. గతంలో ఎంతో మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరిగినా...తమకు ఇదే ఫస్ట్‌టైం అన్నట్లు బిల్డ్ఫ్ ఇస్తారు..కానీ..పెళ్లి అయిన 'విద్యాబాలన్' మాత్రం తనకు పెళ్లికి ముందే డేటింగ్ చేశానని చెప్పడం విశేషం. మరి నిజం చెప్పిన 'విద్యాబాలన్'పై ఆమె భర్త సిద్దార్థ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి మరి.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ