WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫిట్‌నెస్‌ కోసం...'అమీర్‌' కష్టాలు...చూడండి...!(వీడియో)

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ తన చిత్రాల్లో వాస్తవికత కోసం ఎంత కష్టపడతాడో బాలీవుడ్‌లో అందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసినా దానిలో వందశాతం ఫర్‌ఫెక్ట్‌నెస్‌ కోసం కృషి చేస్తాడు...ఇప్పుడు ఆయన తాజా చిత్రం 'దంగల్‌' కోసం ఆయన మరింత కష్టపడుతున్నారు. 

    హరియాణాకి చెందిన రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ జీవితాధారంగా తెరకెక్కిస్తున్న 'దంగల్‌' చిత్రం కోసం ఆయన 25 కిలోల బరువు పెరిగి మళ్లీ కొద్ది రోజుల వ్యవధిలో తగ్గిపోయాడు. చిత్రంలో వచ్చే సన్నివేశాల కోసం ఆయన ఈ విధంగా చేయాల్సి వచ్చింది. మొదట ఇద్దరు పిల్లల తండ్రి పాత్ర కోసం ఆయన 25 కిలోలు పెరిగారు..తరువాత రెజ్లర్‌ పాత్ర కోసం పెరిగిన బరువును కరిగించేశారు. ఈ సినిమా కోసం 'అమిర్‌' ఫిట్‌ టు ఫ్యాట్‌ ఎలా అయ్యాడు..అనే విషయాలను చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఆయన వర్కవుట్‌ను వీడియో తీసి ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. మీరూ చూడండి...'ఆమిర్‌' ఫిట్‌నెస్‌ విన్యాసాలను...!




(215)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ