ప్రేమజంట నాగచైతన్య, సమంతలు కలసి ఒక సినిమాలో పనిచేస్తే వారి మధ్య విభేదాలు వస్తాయని, అందుకే ఇద్దరూ కలసి చేయాల్సిన సినిమాను చేయకుండా వదిలేసుకున్నారని టాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో 'నాగచైతన్య' హీరోగా ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో హీరోయిన్గా మొదట 'సమంత' చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటనతో చాలా కాలం తరువాత ప్రేమపక్షులు మళ్లీ తెరపైన కనువిందు చేయనుందని ప్రేక్షకులు ఆశించారు. అయితే ఇక్కడ వారి ఆశలకు కింగ్ నాగార్జున చెక్ చెప్పారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మీరు ఆ సినిమాలో కలసి నటించవద్దని 'అక్కినేని నాగార్జున' వారిని ఆదేశించారట.ఇద్దరూ కలసి ఒకేచోట కలసి పనిచేస్తే విభేదాలు వచ్చే అవకాశం ఉందని.. దీంతో మొదటికే మోసం వస్తుందని ఆయన చెప్పారట. దీంతో ఈ సినిమా నుంచి 'సమంత'ను పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే 'నాగార్జున' నిర్ణయంపై సినిమా వర్గాలు వేరే విధంగా స్పందిస్తున్నారు. మూడు నాలుగు నెలలు కలసి ఒకే సినిమాలో చేస్తే విభేదాలు వస్తాయా..? అలా అయితే జీవితాంతం ఎలా కలిసి ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. 'సమంత'ను సినిమాల్లోంచి తప్పించేందుకే 'నాగ్' ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు. మొత్తం మీద 'సమంత' కెరీర్ ఇక ముగిసినట్లేనని వారి అభిప్రాయం...!
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ