లేటెస్ట్

'పప్పు' వర్సెస్‌ 'మబ్బు'...!

వెనకటి..చెడపకరా...చెడిదెవు..అన్నారు పెద్దలు...! ఎవరినో...ఎద్దేవా చేద్దామని, ఎగతాళి చేద్దామని, చిన్నబుచ్చాలని,పలచన చేయాలని భావిస్తే...వారే పలచనవుతారని..తాజాగా ప్రధాని నరేంద్రమోడీ విషయంలో స్పష్టమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ'ని ఉద్దేశిస్తూ..గత కొన్నేళ్లుగా..'పప్పు'..అంటూ 'మోడీ' బృందం ఎద్దేవా చేసేది. ఆయనతో ఏమీ కాదని, ఆయన ఏమీ నేర్చుకోలేరని, ఆయనకు తెలివితేటలు లేవని..సందర్భం ఉన్నా లేకున్నా ప్రచారం చేశారు. సోషల్‌మీడియాలో ఆయన పప్పు అంటూ 'మోడీ' భక్తులు ట్రోలింగ్‌ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి..'రాహుల్‌'పై 'పప్పు' ముద్రవేసి...పలచన చేశారు. అయితే 'మోడీ' తాను తీసుకున్న గోతిలో తానే పట్టారు. ఐదేళ్లు ప్రధాని పదవిని వెలగబెట్టిన 'మోడీ' సార్వత్రిక ఎన్నికల ఆఖరు టైమ్‌లో తానెంత మబ్బో..నిరూపించుకున్నారు. 

  పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామని, ఆ దేశంపై 'బాంబులు' వర్షం కురిపించామని...ఒక మీడియా సంస్థకు చెబుతూ... సర్జికల్‌ దాడులు చేసే సమయంలో ఆకాశంలో మబ్బులు బాగా ఉన్నాయని..మన యుద్ధవిమానాలను శత్రుదేశపు రాడార్లు గుర్తించకుండా...మబ్బులు అడ్డుకుంటాయని...ఇదే సమయం దాడి చేయండి..అని తాను ఆదేశాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నారు. మబ్బులు ఉంటే రాడార్లు పనిచేయవా...? ఇదేనా ప్రధాని మోడీ అవగాహన..అంటూ..ఆయన ప్రత్యర్థులు..సోషల్‌మీడియా ఎద్దేవా చేస్తోంది. ఆయన చేసిన కామెంట్లపై వస్తోన్న స్పందతో బిజెపి పెద్దలు వెర్రిమోహాలు వేయాల్సి వచ్చింది. ఇదెక్కడి తంటారా...బాబూ..? ఇవేం వ్యాఖ్యలు...? ఆయన ఏమి మాట్లాడారో..ఆయనకు అర్థం అవుతుందా..? ఎన్నికలు ముగిసిపోయే సమయంలో ఇటువంటి అవగాహన లేని వ్యాఖ్యలు చేశారు కాబట్టి సరిపోయింది..అదే ముందే చేసి ఉంటే...మట్టికొట్టుకుపోయేవాళ్లం..అంటూ బిజెపి నేతలు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఇంత అవగాహన లేని నేతా..మన నేత..అంటూ వారు నోరెళ్లబెడుతున్నారు. ఇన్నాళ్లూ 'రాహుల్‌గాంధీ'ని 'పప్పు'.. అంటూ ఎగతాళి చేశాం..కానీ...'మోడీ' ఇంత 'మబ్బు'..అంటూ ఇప్పుడే తెలిసింది. మొత్తానికి...'మబ్బు' కంటే 'పప్పే'నయం..అనుకుంటున్నారు. 

(274)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ