WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దేశం' వైపు 'మేకపాటి' చూపు...!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం తన పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని...'జగన్‌' ప్రకటించడంతో...దానిని కొట్టిపారేశారు...నెల్లూరు ఎంపి..మేకపాటి రాజమోహన్‌రెడ్డి. రాజీనామాలతో హోదాలు వస్తాయా...? 'జనం'లో హోదాపై స్పందన కనిపించడం లేదని...ఇది తనకు ఎదురయిన అనుభవం అని 'మేకపాటి' చెబుతున్నారు. ఇదే విషయాన్ని 'జగన్‌'కు చెప్పినప్పటికీ...తేలిగ్గా కొట్టిపారేయడంతో.. 'రాజమోహన్‌రెడ్డి'కి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఎంపి పదవికి రాజీనామా చేయడం ఇష్టం లేక టిడిపిలో చేరితే తన రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉంటుందోనని ఆయన అంచనా వేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టిపోయినట్లు కేవలం 10వేల ఓట్ల మెజార్టీతో ఎంపిగా విజయం సాధించారు 'మేకపాటి'. 'జగన్‌' పార్టీ బలం ఎంత వరకు తగ్గిందో చెప్పలేకపోయినా...టిడిపి బలం పెరిగిందని 'మేకపాటి' భావిస్తున్నారు. తనకు ఎంపి, తన సోదరునికి, కుమారునికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసే అవకాశం ఇస్తే టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు ఆయన సై అంటున్నారట. 

    దీనిపై ఇంత వరకు టిడిపి వర్గాల నుండి ఎటువంటి స్పందన వ్యక్తం కాకపోయినా...'మేకపాటి' వలన పార్టీ బలం పెరుగుతుందనడంలో సందేహం లేదని వారు చెబుతున్నారు. ఇదే విషయంపై 'మేకపాటి'ని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా...అటువంటిదేమీ లేదని...ఏదైనా ఉంటే ముందుగా మీకే చెబుతానని..రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారట. నెల్లూరు జిల్లాలో 'మేకపాటి' పార్టీ మారడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన చేరికను..టిడిపి నేతలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు..ప్రకాశం జిల్లాలో కూడా ఆయనకు కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉందని, దీని వల్ల పార్టీ అదనంగా లాభపడుతుందని టిడిపి నాయకులు అంగీకరిస్తున్నారు. 

   ఏది ఏమైనప్పటికీ 'మేకపాటి' ఖచ్చితమైన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వగలిగితే...ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 'మేకపాటి'ని వదులుకునేందుకు 'జగన్‌' సిద్ధంగా లేరని...ఏదో విధంగా నచ్చచెప్పి..రాజీనామాల అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురాకుండా హామీ ఇచ్చే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. మరి 'జగన్‌' బుజ్జగింపులు పనిచేస్తాయా...? లేదే వేచి చూడాలి మరి...!





(1188)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ