WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణాలో శృతిమించని 'అవినీతి'...!

వ్యాపార రాజధానిగా పేరున్న కృష్ణాజిల్లాలో రాజకీయ,అధికార, ఉద్యోగుల అవినీతి మిగతా జిల్లాల కన్నా చాలా తక్కువగా ఉందని వివిధ రాజకీయ పార్టీల నాయకులే అంగీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి సర్వేలో కూడా ఇదే విధమైన నివేదిక వచ్చిందట. మంత్రులిద్దరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు..అవినీతికి దూరంగా ఉంటున్నారట. వీరు అవినీతి మట్టి అంటకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ..క్రింది స్థాయిలో అవినీతి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారట. కాల్‌మనీ వ్యవహారంలో ఒకరిద్దరు నాయకులు, ఒక ఎమ్మెల్యేపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి...తప్ప...మిగతా వారిలో ఎటువంటి విమర్శలు ఎవరూ చేయలేదు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమపథకాలు అమలు తీరులో కూడా అవినీతి చాలా తక్కువగా ఉందని అధికార,విపక్ష నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. 

   గ్రామాల్లో ఇది వరకటి పరిస్థితే యధావిధంగా కనిపిస్తుందని అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులు దౌర్జన్యాలతో అవినీతికి పాల్పడినా...ఇప్పుడు ఆ బాటలో టిడిపి నాయకులు నడవడం లేదని..'జగన్‌' పార్టీ నాయకులు కూడా అంటున్నారు. విజయవాడ, బందరు ఎంపిలతో పాటు పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల్లో పట్టుకోసం తపిస్తున్నారే తప్ప...వ్యాపారాలతో మరో విధంగా ఆర్థికంగా బలపడుతున్నారే తప్ప...రాజకీయ అవినీతికి దూరంగా ఉంటున్నారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం గతంలో కన్నా పెరిగిన మాట యధార్థమేనని, విపక్షాల నాయకులు కూడా అంగీకరిస్తున్నారు...సీనియర్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా అవినీతి పరులను దూరంగా పెడుతూ సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. 

  ఎక్సైజ్‌శాఖ మంత్రి 'కొల్లు రవీంద్ర' పేరుతో కొన్ని అవకతవకలు జరిగినా...అవి 'జనానికి' నష్టం కల్గించకపోవడంతో ఆయన బయటపడ్డారు. ఎమ్మెల్యేలు బోండా ఉమ, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌రావు ఇతర ఎమ్మెల్యేలు అవతవకలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలకు ఇబ్బంది కల్గకుండా అనుచర వర్గానికి ఆర్థిక లబ్ది కల్గించేందుకు సహాయ,సహకారాలు అందిస్తున్నారు. ఏది ఏమైనా కృష్ణా జిల్లా మిగతా జిల్లాల కన్నా నిజాయితీలో ముందుండడం సంతృప్తిగా ఉందని మంత్రి దేవినేని 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి తెలిపారు.

(310)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ