WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దేశం' వైపు తండ్రీ,కొడుకులు...!

పీలేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు 'జగన్‌'కు అత్యంత సన్నిహితులైన తండ్రీ కొడుకలు ఆయనకు దూరంగా ఉండడంతో వారిద్దరూ పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. 'చంద్రబాబు'తో సన్నిహితంగా మెలిగే ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఇప్పటికే అనేక పనులు చక్కబెట్టుకున్నారని టిడిపి వర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నాయి. పేరుకే ప్రతిపక్ష ఎమ్మెల్యే అని...అధికారపక్షంతో సమానంగా అన్ని పనులు ఆయనకు జరిగిపోతున్నాయని టిడిపి నాయకులు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 'జగన్‌' పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు బద్దశత్రువైన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తన దోవ తాను చూసుకునేందుకు యత్నిస్తున్నారు. 'కిరణ్‌' 'జగన్‌' పార్టీలో చేరతారా? లేదా...? అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ..దీనిపై 'రామచంద్రారెడ్డి'కి కొన్ని అనుమానాలు ఉన్నాయి. 

  ఆయన పార్టీలో చేరితే...ప్రస్తుతం ఉన్న పదవులు యధావిధంగా ఉంటాయని రామచంద్రారెడ్డికి తెలుసు. అంతే కాకుండా 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు ఓడిపోయిన రెండు,మూడు నియోజకవర్గాల్లో తాను ఆపార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని, ఆయన ధీమాతో చెబుతున్నారు. 1994 ఎన్నికల్లోమాత్రమే 'రామచంద్రారెడ్డి' ఎమ్మెల్యేగా ఓడిపోయారు..ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేరిక వల్ల పార్టీ బలపడుతుందని చంద్రబాబుకు తెలుసు. 'కిరణ్‌'కు బద్దశత్రువైన 'రామచంద్రారెడ్డి' పార్టీలో చేర్చుకుని గతంలో టిడిపి అభ్యర్థులు ఓడిపోయిన నియోజకవర్గాలను తిరిగిని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో 'చంద్రబాబు' ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం...! బద్ధశత్రువులైన 'కిరణ్‌', రామచంద్రారెడ్డిలు చేరోవైపు తలపడితే జిల్లాలో రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


(3592)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ