WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వరలక్ష్మి' ఐదు కిలోలు తగ్గిందట...!

'శరత్‌కుమార్‌' వారసురాలుగా సినీగ్రేటం చేసిన తార 'వరలక్ష్మి'. అయితే ఆమెకు సినిమా అవకాశాలు కల్పించడంలో 'శరత్‌ వారసురాలు' అనే పేరు కలిసి వచ్చినా...పరాజయాలు ఆమె కెరీర్‌ను మసకబార్చాయి. అరంగ్రేట్‌ చిత్రం పరాజయం తరువాత ఎన్నో ఆశలు పెట్టుకున్న  పెట్టుకున్న బాలా 'తారాతప్పట్టై' బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడడంతో వరలక్ష్మి కెరీర్‌ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ బరువు తగ్గించుకోవాలనే నిర్ణయం తీసుకుందట. జిమ్‌లో రోజూ కష్టపడుతూ ఐదు కిలోల బరువు తగ్గిందట. దీంతో ఆమెకు 'విక్రమ్‌' సినిమాలో అవకాశం దక్కిందట. ఇదే ఊపులో మరిన్ని చిత్రాల్లో చేయడానికి అవకాశం లభించదట. మొత్తం మీద బరువు తగ్గడంతో 'వరలక్ష్మి' జాతకం మారిపోయిందని కోలీవుడ్‌లో అనుకుంటున్నారు. 

(207)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ