WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎంగా 'మహేష్‌...! ఆంధ్రాకా...తెలంగాణాకా...!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌, క్రేజీ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ చిత్రంలో 'మహేష్‌' సిఎంగా నటించబోతున్నారట. ఈ సినిమాకు సిఎం అనిపేరు పెడతారని వార్తలువస్తున్న నేపథ్యంలో తాజాగా సినిమా నిర్మాత దానయ్య 'మహేష్‌.. అనునేను..! అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించాడట. అంటే ఈ సినిమాలో 'మహేష్‌' సిఎంగా కనిపించబోతున్నారన్నమాట యధార్థమే. అయితే మహేష్‌ ఏ రాష్ట్రానికి సిఎంగా నటించబోతున్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఈ చిత్రంలో ఆయన చేసే సిఎం పాత్ర తెలంగాణకా, లేక ఆంధ్రప్రదేశ్‌కా...? గతంలో 'దూకుడు' సినిమాలో ఆయన కాసేపు ఎమ్మెల్యేగా కనిపించారు. ఈ సినిమాలో ఆయన తెలంగాణ యాసలో అదరగొట్టేశారు. మరి..సిఎంగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాల్సి ఉంది.


(368)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ