లేటెస్ట్

ఎగ్జిట్‌పోల్స్‌తో కంగారు పడవద్దు:చంద్రబాబు...!

ఆదివారం నాడు వచ్చే ఎగ్జిట్‌పోల్స్‌ను చూసి కంగారు పడవద్దని టిడిపి నాయకులకు, కార్యకర్తలకు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఎగ్జిట్‌పోల్స్‌లో మనకు వ్యతిరేకంగా వచ్చినా..వాటి గురించి పట్టించుకోవద్దని వందకు వందశాతం మనమే గెలుస్తున్నామని తెలిపారు. మంగళవారం నాడు క్యాబినెట్‌ మీటింగ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పారు. ప్రధాని మోడీ విషయంలో చేయాల్సినంత చేయలేదని, ఆయన గురించి ప్రచారం సరిగా చేయలేదని, ఉత్తరాది ప్రజలకు ఆయన గురించి ఆలస్యంగా తెలిసిందని అన్నారు. ఎన్నికల్లో 'మోడీ' ఎట్టి పరిస్థితుల్లో గెలవరని, ఒకవేళ ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా..'మోడీ' మాత్రం ప్రధాని కారని 'చంద్రబాబు' తేల్చి చెప్పారు.

(295)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ