WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలో 'కిరణ్‌'ను చేర్చుకోం:జగన్‌

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్‌ తగిలింది. నిన్న మొన్నటి దాకా ఇక వైకాపాలోకి తన చేరిక లాంఛనమేనని భావించిన ఆయనకు 'వైకాపా' అధ్యక్షుడు 'జగన్‌' షాక్‌ ఇచ్చారట. ఆయనను పార్టీలో చేర్చుకోమని తేల్చి చెప్పారట. తాను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని, పెళ్లికూతురు సిద్దం కాలేదని ఇటీవల 'కిరణ్‌' తన రాజకీయ భవిష్యత్‌ గురించి చెప్పారు. అయితే పెళ్లి కూతురు వైకాపానేనని, ఆయన ఆపార్టీలో చేరడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయన చేరికకు 'జగన్‌' సుముఖంగా లేరని తెలుస్తోంది. గతంలో తనను 'కిరణ్‌' నమ్మించి మోసం చేశారని, అటువంటి వ్యక్తిని పార్టీలోకి రానిచ్చేది లేదని ఆయన అంటున్నారట. అదీ కాక 'కిరణ్‌' పార్టీలోకి వస్తే వైకాపాలో ఉన్న సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతానని బెదిరిస్తున్నారట. ఆయనకు 'కిరణ్‌'కు బద్ధశత్రుత్వం ఉంది. ఒకవేళ 'కిరణ్‌' వైకాపాలోకి వస్తే...పెద్దిరెడ్డి తన తనయుడు మిధున్‌రెడ్డితో కలసి టిడిపిలో చేరతారని వార్తలు వస్తున్నాయి. దీంతో వైకాపా అధినేత 'కిరణ్‌' విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్నారట. ఆయనను చేర్చుకుని గట్టి నాయకులైన 'పెద్దిరెడ్డి'ని వదిలేసుకునేది లేదని చెబుతున్నారట.  దీంతో 'కిరణ్‌'కు వైకాపా దారులు మూసుకుపోయాయి. దాంతో ఆయన బిజెపి వైపు చూస్తున్నారట. బిజెపి సీనియర్‌ నేత వెంకయ్యనాయుడును పట్టుకుని తననుపార్టీలో చేర్చుకోవాలని బతిమాలుడుతున్నారట. అయితే ఆయనను బిజెపిలో చేర్చుకునే ఉద్దేశ్యం 'వెంకయ్య'కు లేదట. అయినా చూద్దాం...చేద్దాం..అంటూ రోజులు గడుపుతున్నారట. ఇక 'వెంకయ్య'తో అయ్యే పనికాదని ఆయన మరో కేంద్ర మంత్రి పరికర్‌ను కాకా పడుతున్నారట. 'పరికర్‌' కరుణిస్తే మనోడు బిజెపిలో చేరడం ఖాయం..అని 'కిరణ్‌' అనుచరులు చెప్పుకుంటున్నారట. ఇంతకీ ఆంధ్రా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బిజెపిలో చేరి 'కిరణ్‌' చేసేదేమిటని కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు...ఏది ఏమైనా 'కిరణ్‌'కు తొందరగా పెళ్లి చేయాలని ఆయన అనుచరులు ఒకటే ఒత్తిడి తెస్తున్నారు.

(817)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ