WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్నిసార్లు 'గర్భవతి'ని చేస్తారు...?

తనను ఎన్నిసార్లుగ గర్భవతిని చేస్తారని బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ మీడియాపై మండిపడుతుందట. ఆమె గర్భవతి అంటూ పలు మీడియా సంస్థలు వార్తలు రాస్తుండడంతో ఆమెకు చిర్రెత్తుకొస్తుందట. నెలకోసారి ఏదో ఒక మీడియా ఆమె గర్భవతి అంటూ పేర్కొంటుండంతో సంవత్సరానికి ఎన్నిసార్లు గర్భవతిని అవుతాను..అంటూ ఆమె ప్రశ్నిస్తుందట. నెలకోసారి గర్భవతి అవుతానా...? అంటూ మండిపడుతుందట. రాసేదానికి అర్ధం..పర్థం లేకుండా ఏమిటీ రాతలు అంటూ మండిపడుతోందట. అంతే కాకుండా తనకూ తన భర్తకు విభేదాలు ఉన్నాయని వార్తలు...రాస్తున్నారని...తాను భర్తకు విడాకులు ఇచ్చానని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఇదేం పద్దతి అంటూ ఆమె వాపోతోంది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని వార్తలురాయాలని ఆమె మీడియాను కోరుతుంది. మరి సంచలనాలకు అ  పడ్డ మీడియా ఆమె మొర ఆలకిస్తుందా...?

(211)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ