WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శృంగార సామర్ధ్యం పెరగాలంటే 'పొగ'ను వదిలేయండి...!

40సంవత్సరాలు వచ్చిన తరువాత శృంగార సామర్ధ్యం తగ్గుతూ ఉంటుంది. ఇంతకు మునుపు వలే రోజుకు రెండు,మూడుసార్లు శృంగారంలో పాల్గొనడం కష్టం అవుతుంది. వయసుతో వచ్చే పలుమార్పులలో సెక్స్‌ సంబంధమైనవి కూడా ఉంటాయి. పెరిగే వయసుతో పాటు ఇతర అంశాలు శృంగార సామర్ద్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంటాయి. నలభై సంవత్సరాల తరువాత మరో పది సంవత్సరాల పాటు శృంగారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ముందుగా కొన్నింటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు శృంగారవైద్యులు. వాటిలో ముఖ్యమైనది పొగాకు దూరంగా ఉండడం. పొగాకు దూరంగా ఉంటే చాలా వరకు శృంగార సమస్యలు దూరం అవుతాయట. పొగతాగే అల‌వాటు వ‌ల్ల‌ రక్తనాళ ఇబ్బందులు శరీరంలో ఎక్కడైనా వస్తాయి. దీనివలన రక్త ప్రవాహంలో అవరోధాలు ఏర్పడి పురుషాంగంలోకి రక్త ప్రవాహం తగ్గుతుంది. పురుషాంగ స్తంభన రక్త ప్రవాహం వల్ల జరిగేదన్న విషయం తెలిసిందే. రక్త ప్రవాహం లోపం వల్ల అంగం సరిగా స్థంభించదు. దీనితో పాటు శ్రీఘ్రస్థలన సమస్య కూడా తలెత్తుతుంది. 

   ఇది మహిళల సెక్స్‌ సామర్ధ్యాన్ని కూడా తగ్గిస్తుంది. మన దేశంలో మహిళలు 'పొగా'కు పెద్దగా వాడకపోయినా...ఇటీవలి కాలంలో ఆధునిక మహిళలు తరచూ పొగాకును వినియోగిస్తున్నారు. దీని వల్ల మహిళల్లో వారి యోని కండరాలకు, క్లైటోరిస్‌కి రక్త ప్రసరణ తగ్గుతుంది. అంగప్రవేశాన్ని ఆనందించలేని పరిస్థితి మహిళలకు కలుగుతుంది. పొగాకు వాడకం వల్ల మగవారిలోనూ, ఆడవారిలో నూ సెక్స్‌ సమస్యలు పెరిగిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు.



(393)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ