WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పెళ్లి ప్రకటన తరువాత నన్ను దూరం పెడుతున్నారు...!

తాను పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటన చేసిన తరువాత తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలు తనను దూరం పెడుతున్నారని టాప్‌హీరోయిన్‌ సమంత ఆవేదన వ్యక్తం చేసున్నారు. తాను నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించిన తరువాత నిర్మాతలు తనకు సినిమాల్లో అవకాశం ఇవ్వడం లేదని, దీనికి కారణం ఏమిటో తనకు తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను నాగార్జున కోడలు అయినంత మాత్రాన తాను సినిమాలు చేయకూడదా..? అని ఆమె ప్రశ్నించింది. తాను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయనని చెప్పలేదని మరి...ఎందుకు నిర్మాతలు తనకు అవకాశాలు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని చెబుతోంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా యాడ్స్‌లోనైనా అవకాశం వస్తుందని భావించానని, అయినా వాటిలో కూడా అవకాశం రావడం లేదని వాపోతోంది. తాను చేసిన నేరం ఏమిటో...తెలియదని...ఒకటిరెండు ప్రాజెక్టులు త్వరలో ఫైనల్‌ కాబోతున్నాయని ఈ అమ్మడు అంటోంది. ఈ సంవత్సరం 'సమంత' నటించిన 'అ..ఆ', 'జనతాగ్యారేజ్‌'లు విజయం సాధించాయి. రెండు సినిమాలు విజయవంతమైనా అవకాశాలు లేకపోవడం విచిత్రమే. పాపం పెళ్లి  ప్రకటన 'సమంత'కు ఎంత ఇబ్బందిపెట్టిందో...!






(703)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ