WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఘనంగా 'నాగార్జున' చిన్నకొడుకు నిశ్చితార్థం...!

అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్‌ నిశ్చితార్థం శ్రీయాభూపాల్‌తో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నాడు వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ పంక్షన్‌హాలులో జరిగింది. 'నాగార్జున, అమలల కొడుకు అయిన 'అఖిల్‌' శ్రీయాభూపాల్‌తో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ వివాహానికి ఇరువైపుల పెద్దలు అంగీకరించారు. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యలో వీరి నిశ్చితార్థం నిర్వహించారు. 'అఖిల్‌' తెలుగులో ఓ సినిమాలో నటించగా...మరో రెండు మూడు ప్రాజెక్టులు రన్నింగ్‌లో ఉన్నాయి. కాగా ఆయన చేసుకోబోయే శ్రీయా ప్యాషన్‌ డిజైనర్‌.  ఇటీవలే 'నాగార్జున' తన ఇద్దరి కొడుకుల వివాహం త్వరలో చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు చిన్న కొడుకు వివాహనిశ్చితార్థాన్ని నిర్వహించగా పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం త్వరలో సినీనటి 'సమంత'తో చేయనున్నారు.


(237)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ