WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

40దాటినా...సెక్స్‌లో ఉత్సాహంగా...!

మీ వయస్సు 40సంవత్సరాలు దాటిందా...? శృంగార కోరికలకు కళ్లెం పడుతున్నట్లు అనిపిస్తుందా...? సెక్స్‌ పట్ల వ్యామోహం తగ్గినట్లు...రోటీన్‌ కార్యక్రమంలా అనిపిస్తుందా...? స్థంభన సమస్యలు ఎదుర్కొంటున్నారా...?అంగ ప్రవేశాన్ని ఆనందించలేకపోతున్నారా...? ఒకప్పుడు శృంగారంపై ఉన్న ఆసక్తి ఇప్పుడు ఉండడం లేదా...? అంటే అవుననే సమాధానం వస్తే...ఇలా చేయండి..!


1.మీ వయస్సు 40 దాటిన తరువాత శరీరాన్ని అదపులో ఉంచుకోవడం అవసరం.శరీరం రూపం మారిన కొద్దీ శృంగారం పట్ల ఆకస్తి తగ్గుతుంది. అతిగా లావు ఎక్కితే ఇబ్బంది..బరువు పెరిగితే రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి శారీరక బరువును అదుపులో ఉంచుకోవాలి.


2.పొట్ట పెరగనివ్వకూడదు. ఇది డయాబెటిక్‌కి దారి తీస్తుంది. దీని వల్ల అంగస్థంభన సమస్య ఏర్పటుతుంది. అంతే కాదు పొట్ట పెరగడం వల్ల శరీరంపై మహిళలకు ఆసక్తి ఉండదు.


3.నిత్యం వ్యాయామం చేయండి. దీని వల్ల సెక్స్‌ అంగాలకు రక్తం బాగా ప్రవహిస్తుంది. ప్రతి రోజు కనీసం 20 నిమిషాలైన వ్యాయామం చేయండి. ఎటువంటి వ్యాయామం చేయాలనేది మీ వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.


3.వయస్సు పెరగడం అనేది మన చేతిలో ఉండదు కాబట్టి వైద్య పరీక్షలు చేయించుకోండి. సమస్య లేకపోయినా మధ్య మధ్యలో సమస్యలు రావటం వల్లే సెక్స్‌ తృప్తి లోపం వారి ఆలోచనలకు పరి పరి విధాలుగా తీసుకువెళుతుంది. వయసు మీద పడిన తరువాత దంపతులకు ఇద్దరికీ శృంగార సమస్యలు రావచ్చు. కనుక వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.


4.మహిళల్లో 40 దాటిన తరువాత ఏర్పడే ప్రధాన సమస్య యోనిలో ద్రవాలు ఊరకపోవడం,డ్రై అయిపోవడం. దీని వల్ల అంగ ప్రవేశం చేసేటప్పుడు మంట, చికాకు ఉంటాయి. వైద్య పరీక్షల వల్ల వైద్యులు దీనికి సులువైన మార్గాలు చెబుతారు. దాంతో సులభంగా అంగప్రవేశం జరిగిపోతుంది.


5.పురుషుల్లో కొంత మందికి అంగస్థంభన సమస్యలు ఏర్పడతాయి. అంగం స్థంభించినా శీఘ్రస్థలన సమస్య ఏర్పడుతుంది. ప్రొస్టేట్‌గ్రంధిలో ఏర్పడిన సమస్యలు కూడా దీనికి తోడవుతాయి. దీనికి తోడు ఈ వయసులో ఎదురయ్యే కుటుంబబాధ్యతలు, ఆర్థిక సమస్యలు ఈ సమస్యను ఇంకా పెద్దవి చేస్తాయి. ఇటు వంటి సమస్యలు ఉన్న వారు తగిన జీవనవిధాన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దరిమిలా వయసు పెరిగినా సెక్స్‌ను హాయిగా, ఆనందంగా, తృప్తిగా అనుభవిస్తారు.


6.వయసు పెరిగిన తరువాత కొంత మేర సెక్స్‌ కోర్కెలు తగ్గడం సహజం. దాన్ని నిజాయితీగా స్వీకరించాలి.సెక్స్‌కు అంగాలు సహకరించకపోవడం వయసు తెచ్చిన మార్పేనని గుర్తించాలి. దాన్ని గుర్తించకుండా తాము సెక్స్‌ జీవితానికి పనికి రాకుండా పోయామని భావించి నకిలీ డాక్టర్ల దగ్గరకు వెళితే ఇబ్బందులు తలెత్తడం ఖాయం. కనుక వయసు తెచ్చే మార్పులను యధాతధంగా స్వీకరించడం ఉత్తమం. ఏ వయస్సులో ఏది ఉత్తమమో అదే చేస్తూ సెక్స్‌ జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలి.


(1417)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ