లేటెస్ట్

'రామోజీ,చంద్రబాబు'ల భేటీ సారాంశం..ఏమిటి...?

తెలుగు రాష్ట్రాల్లో 'ఈనాడు' రామోజీరావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు 'చంద్రబాబునాయుడు'ల భేటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రైవేట్‌ పార్టీ కోసం 'చంద్రబాబునాయుడు' రామోజీఫిల్మ్‌సిటీకి వెళుతున్నారని నిన్న సిఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ఉదయం ఆయన హెలికాప్టర్‌లో హైదరాబాద్‌లోని 'రామోజీఫిల్మ్‌సిటీ'లో దిగిన వైనంపై తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రావడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఇరువురు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారి భేటీలో ఏం చర్చించారనేది తెలియకపోయినా...వారివురు కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం గురించి చర్చించారని, అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల గురించి కూడా చర్చించారని ప్రచారం జరుగుతోంది.

వైకాపా,టిఆర్‌ఎస్‌ వర్గాల అంచనాల ప్రకారం 'రామోజీరావు' 'చంద్రబాబు'ను కలవడం వెనుక..బిజెపి పెద్దలు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బిజెపి ఒంటరిగా గెలిచే అవకాశం లేకపోవడంతో...గతంలో ఎన్‌డిఎను వీడిపోయిన వారిని మళ్లీ ఎన్‌డిఎలోకి తీసుకు రావడానికి 'రామోజీ' సహాయం తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు. కేంద్రంలో బిజెపికి మెజార్టీ తగ్గితే 'మోడీ' స్థానంలో 'గడ్కరీ' లేక 'రాజ్‌నాథ్‌సింగ్‌'ను ప్రధానిని చేస్తారని, దీనికి 'చంద్రబాబు' మద్దతు కోరేందుకే 'రామోజీ' ఆయనను ఫిల్మ్‌సిటీకి పిలిపించారని చెబుతున్నారు. ఇంకోవైపు యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ 'కెసిఆర్‌, జగన్‌'లతో టచ్‌లోకి వచ్చిందని, దాంతో 'చంద్రబాబు' తన వ్యూహాన్ని రూపొందించుకునేందుకు 'రామోజీ'ని కలుస్తున్నారని,ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి చేయాలనే దానిపై చర్చించారని అంటున్నారు. 

'బిజెపి' కోసం 'రామోజీ' మద్దతు అడగరు...!?

కాగా...వైకాపా, టిఆర్‌ఎస్‌ చేస్తోన్న ప్రచారంపై టిడిపి మండిపడుతోంది. 'రామోజీరావు' 'మోడీ' కోసం 'చంద్రబాబు' మద్దతు అడగరని, గత కొన్నాళ్లుగా 'మోడీ'పై 'రామోజీ' ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మోడీ' ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు 'రామోజీ'ని ప్రత్యేకంగా గౌరవించారు. అప్పట్లో 'ఈనాడు' కూడా 'మోడీ'కి అండగా ప్రచారం చేసింది. అయితే రాను రాను..'మోడీ', 'రామోజీ'ల మధ్య దూరం పెరిగిందని, ఇటీవల ఎన్నికల్లో 'ఈనాడు' 'కాంగ్రెస్‌'కు అనుకూలంగా మారిందనే వాదనలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 'మోడీ' లేదా 'బిజెపి' కోసం 'రామోజీ' 'చంద్రబాబు' మద్దతు అడగరని చెబుతున్నారు. వారిద్దరి భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదేనని, భేటీ సందర్భంగా...రాజకీయాలు చర్చకు వస్తాయని, దానిలో తప్పేమీ లేదని వారు అంటున్నారు. 

'వెంకయ్య' కోసం వ్యూహం పన్నారా...!?

కేంద్ర రాజకీయాలు చర్చకు వచ్చినప్పుడు 'బిజెపి'కి మెజార్టీ రాదని, ఆ పార్టీకి 150సీట్లు వస్తే...ప్రాంతీయ పార్టీలతో కలసి కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేసే అవకాశాలు చర్చించారని ప్రచారం జరుగుతోంది. బిజెపికి స్వంతగా మెజార్టీ రాకపోతే 'మోడీ,అమిత్‌షా'లను ఆర్‌పస్‌ఎస్‌ పక్కన పెడుతుందని, వారి స్థానంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న 'వెంకయ్యనాయుడు'ను ప్రధానిగా చేసే అవకాశం ఉందని, దీనికి 'చంద్రబాబు' తప్పక మద్దతు ఇస్తారని, ప్రాంతీయ పార్టీలను 'వెంకయ్య'కు మద్దతు ఇస్తాయని దీంతో మరోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. దీనిలో ఎంత వరకు వాస్తవం ఉందో..తెలియదు. అయితే రకరకాలైన కాంబినేషన్లుపై చర్చించి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద...ఈ రోజు వారిద్దరి మధ్య జరిగిన భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్పుకుంటున్నారు. 

(1220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ