WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హీరోయిన్‌ను అతను ఎక్కడ తాకాడో తెలుసా...?

ప్రముఖ హీరోయిన్‌ 'టీనాదత్తా'కు విమానంలో లైంగికవేధింపులకు గురి అయిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. తాను జెట్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణిస్తుంటే ఒక ప్రయాణీకుడు తనను తాక కూడని చోట తాకాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను తాకిన ప్రయాణీకుడిపై తాను విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వివరాల్లోకి వెళితే ఇటీవల ఆమె జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ప్రయాణిస్తుండగా తన వక్షస్థలాన్ని తాకుతూ ఓ ప్రయాణీకుడు వెళ్లాడట. దాంతో ఆగకుండా అతను తన పక్కన కూర్చుని ఒకటే రుద్దుతున్నాడట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన 'టీనాదత్తా' విషయాన్ని విమానసిబ్బందికి ఫిర్యాదు చేసిందట. అయితే సిబ్బంది అతనిపై చర్యలు తీసుకోకుండా కేవలం అతని సీటు మార్చి ఊరుకున్నారట. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను వేధించిన వ్యక్తిపై చర్య తీసుకోకుండా సీటు మార్చడమేమిటని ప్రశ్నించిందట. దీనికి జెట్‌ఎయిర్‌వేస్‌ సిబ్బంది స్పందించలేదట. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందట. అంతే కాకుండా అతనిపై చర్య తీసుకోవాలని కోరుతూ దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌చేసింది. అతనిపై చర్యలు తీసుకునే వరకు ఆమె పోస్టింగ్‌ను వైరల్‌ చేశాలని నెట్‌జనులను కోరుతుంది. మహిళలను వేధిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని ఆమె ప్రశ్నిస్తోంది.


(590)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ