WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నడుము లావైతే పన్నుచెల్లించాలి:ప్రధాని

నడుము లావుంటే ఇకపై పన్నేస్తామని బ్రిటన్‌ దేశ ప్రధాని థెరిసామే తమ దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మహిళలు కానీ, పురుషులు కానీ తమ నడుమును భారీగా పెంచితే చర్యలు తప్పవని ఆమె చెప్పారు.బ్రిటన్‌లో ప్రజలు రోజు రోజుకు భారీకాయుల్లా తయారు అవుతున్నారని దీని వల్ల ప్రాణాంతకమైన మధుమేహం,ఊబకాయం, కేన్సర్‌ వంటి వ్యాధులు వస్తున్నాయని ప్రధాని ఆందోళన చెందుతున్నారు. భారీకాయం వల్ల బరువు పెరిగి ఇతర వ్యాధులు కూడా వస్తున్నాయని దీన్ని అరికట్టడానికి ప్రజలు నాజుకుగా తయారు కావాలని ఆమె చెబుతున్నారు.వీరే కాకుండా చిన్నారుల్లో కూడా విపరీతమైన భారీకాయం వస్తోందని దీనికి స్టాప్‌ డ్రింక్స్‌ కారణమని అటువంటి స్టాప్‌ డ్రింక్స్‌పై పన్నులు పెంచుతామని ఆమె తెలిపారు. పిల్లలు ఇష్టపడి తినే పదార్థాలల్లో షుగర్‌ తగ్గించాలని ఆమె కంపెనీలను ఆదేశించారు. చిన్నారులకు శారీరక శ్రమ పెంచే ఆటలను బాగా ఆడించాలని, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని థెరిసా విధానంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.


(486)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ