WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ పాత్ర రావుగోపాలరావు చేయాల్సింది':కోట

'అహ..నాపెళ్లంట' సినిమాలో 'లక్ష్మీపతి' పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా పేరు గుర్తుకు వచ్చినప్పుడల్లా అనుకోకుండానే పెదాలపైకి నవ్వుతన్నుకువస్తుంది. దర్శకుడు 'జంద్యాల' ఆ పాత్రను మలచిన తీరు...ఒక విశేషమైతే...ఆ పాత్రలో జీవించి ప్రాణం పోశారు 'కోట శ్రీనివాసరావు'. భయంకరమైన పీనాసి తనానికి పేరయిన 'లక్ష్మీపతి' పాత్రకు తొలుత 'రావుగోపాలరావు'తో చేయించాలని ఆ సినిమా నిర్మాత 'రామానాయుడు' పట్టుబట్టారట. అయితే 'రావుగోపాలరావు' అయితే బాగుండదని...దర్శకుడు 'జంద్యాల' ఆయనను వద్దన్నారట. ఈ విషయంపై నిర్మాత 'రామానాయుడు, దర్శకుడు 'జంద్యాల' వాదులాడుకున్నారట. ఈ విషయాన్ని నిర్మాత 'రామానాయుడు' స్వయంగా 'కోట శ్రీనివాసరావు'కు చెప్పారట.

     హైదరాబాద్‌ విమానాశ్రయంలో 'రామానాయుడు' 'కోట' ఎదురుపడ్డారట. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఈ విషయంపై చర్చ జరిగిందట. 'ఏమయ్యా...కోటా...మా సినిమాలో ఓ వేషం ఉంది...అది నువ్వే వెయ్యాలని దర్శకుడు 'జంద్యాల' పట్టుబడుతున్నారయ్యా...! ఈ విషయంలో నాకు దర్శకుడి మధ్య గొడవ కూడా జరుగుతుంది..నువ్వు అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తావని ఆయన అంటున్నారు...నేనేమో... 'రావుగోపాలరావు' తో చేయించాలని అనుకుంటున్నాను...కానీ...'జంద్యాల'...రావుగోపాలరావు వద్దు...ఆయన ముఖంలో రాజకళ ఉట్టిపడుతుంది...ఆయనకు ఎంత మేకప్‌ వేసినా...ఈ పాత్రకు అనుకున్న రీతిలో ఆయన సరిపోరు...అందుకే నీతో చేయించాలని ఆయన పట్టుబడుతున్నారు...మరి చేస్తావా...? అని ప్రశ్నించారట.!. దీనితో ఎగిరి గంతేయటం 'కోట' పని అయిందట. ఈ విషయాన్ని 'కోట' ఓ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పారు.

(411)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ