WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శేఖర్‌రెడ్డి' తొలగింపుపై సందేహాలు...!

భారీ ఎత్తున నల్లధనం కూడబెట్టిన టిటిడి సభ్యుడు జె.శేఖర్‌రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలుత సందేహాలు వ్యక్తం చేసింది. ఆయన ఇంట్లో భారీగా నగదు, బంగారం దొరికిన వెంటనే ఆయనను పదవి నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తాను తొలి నుంచి ఇటువంటి వ్యక్తులను దూరంగానే ఉంచుతున్నానని కానీ కొంత మంది సిఫార్సులకు లొంగడం వల్లే ఇటువంటి వ్యక్తులు టిటిడిలోకి వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన తరువాత 'శేఖర్‌రెడ్డి'ని వెంటనే టిటిడి పాలకవర్గం నుండి తప్పిస్తారని అందరూ భావించారు. అయితే ఆయన తొలగింపు జిఒ ఇవ్వడంలో ప్రభుత్వానికి పలు సందేహాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైంది...ఏమనగా ఆయన టిటిడిలో సభ్యుడిగా ఉంటూ ఎటువంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడలేదు...ఇది యధార్థం..మరి అటువంటప్పుడు ఆయనను ఎలా తొలగించాలని అధికారులు మల్లగుల్లాలు పడ్డారట. ఏ కారణం చూపి ఆయనను తొలగించాలనే దానిపై అధికారుల్లో చర్చ జరిగిందట. దీంతో 'శేఖర్‌రెడ్డి'ని రాజీనామా చేయాలని వారు కోరారట. అయితే దానికి ఆయన అంగీకరించలేదట. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు అడ్వకేట్‌జనరల్‌ దృష్టికి తీసుకెళ్లి అనంతరం ఫైల్‌ను సిఎం ముందు ఉంచారట. భారీగా నల్లధనాన్ని పోగేసుకున్న అంశాన్నే ప్రాతిపదికగా తీసుకుని ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు సిఎం సంతకం చేశారట.


(449)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ